Sunday, May 5, 2024
- Advertisement -

డిజాస్టర్‌లో రామ్ చ‌ర‌ణ్ సినిమాతో పోటీ ప‌డుతున్న బాల‌య్య సినిమా

- Advertisement -

బాల‌కృష్ణ త‌న తండ్రి ఎన్టీఆర్‌ జీవిత క‌థ ఆధారంగా ఆయ‌న బ‌యోపిక్‌ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితాన్ని రెండు పార్ట్‌లుగా విభ‌జించి,క‌థానాయ‌కుడు, మ‌హ‌నాయ‌కుడు సినిమాలుగా చేశారు బాల‌య్య మొద‌టి పార్ట్ కథానాయ‌కుడు ఈ సంక్రాంతికి విడుద‌లై అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. గ‌త శుక్ర‌వారం రెండో పార్ట్ మ‌హ‌నాయ‌కుడు కూడా ప్రేక్ష‌కుల‌కు ముందుకువ‌చ్చింది.ఈ సినిమా కూడా అభిమానుల‌ను అల‌రించ‌లేక‌పోయింది. ‘కథానాయకుడు’ కలెక్షన్సే దారుణం అనుకుంటే,’మహానాయకుడు’ కలెక్షన్స్ మొదటిభాగం కంటే మరింత దారుణంగా ఉన్నాయి. బాల‌య్య కెరీర్‌లోనే ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచే అవ‌కాశం ఉందని ట్రెండ్ పండితులు చెబుతున్నారు.

సినిమా క‌లెక్ష‌న్స్ చూస్తుంటే బాల‌య్య అభిమానులు కూడా ఈ సినిమా దూరంగా ఉన్నారా..? అని అనిపిస్తోంది. ఇక సినిమా యూఎస్‌లో రామ్ చ‌ర‌ణ్ సినిమాతో పోటీ ప‌డుతోంది. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేయ రామ యూఎస్‌లో అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను క్రాస్ చేసే ప‌నిలో ప‌డింది బాల‌య్య మ‌హ‌నాయ‌కుడు.’వినయ విధేయ రామ. $260k గ్రాస్ కలెక్షన్స్ తో మాత్రమే సరిపెట్టుకుంది.బాలయ్య సినిమా కలెక్షన్స్ $200k మాత్రమే సాధించింది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ బ‌ట్టి చూస్తుంటే రామ్ చ‌ర‌ణ్ పేరు మీద ఉన్న డిజాస్టార్ రికార్డు బాల‌య్య సినిమాకు షిఫ్ట్ అయ్యేలా ఉంది. అలా జరిగితే ‘వినయ విధేయ రామ’ రికార్డు ను ‘మహానాయకుడు’ సొంతం చేసుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -