Friday, April 26, 2024
- Advertisement -

బీహార్ లో ఫైట్స్ చేయనున్న బాలకృష్ణ

- Advertisement -

ఈ ఏడాది మొదట్లో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు భాగాలు డిజాస్టర్లుగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఏ సినిమాలో కనిపించబోతున్నాడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా బాలకృష్ణ తన ‘జై సింహ’ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తో చేతులు కలపబోతున్నారు అని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జూలై 15 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. మొదటి షెడ్యూల్ బీహార్ లో జరగనుంది. ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు సమాచారం. దీని తాలూకు అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. బాలకృష్ణ ఈ సినిమాలో రెండు విభిన్న అవతారాలలో కనిపిస్తారట. ఒకవైపు బాలయ్య సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడమే కాక మరో వైపు గ్యాంగ్స్టర్ అవతారంలో కూడా కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఎలా మారాడు అనేదే ఈ సినిమా కథ అని కొందరు చెబుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -