Thursday, March 28, 2024
- Advertisement -

టెలీ కాన్ఫ‌రెన్స్‌లో బాబుకు షాక్ ఇచ్చిన గంటా శ్రీనివాస‌రావు..

- Advertisement -

టీడీపీ నుంచి న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు భాజాపాలోకి వెల్లి 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే మ‌రికొంత‌మంది ఎమ్మెల్యేలుకూడా వెల్లేందుకు సిద్ద‌మ‌య్యార‌నె వార్త‌ల నేప‌ధ్యంలో విదేశీ టూర్‌లో ఉన్న చంద్ర‌బాబు అత్య‌వ‌స‌రంగా ముఖ్య నేత‌ల‌తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను బాబ‌కు వివ‌రించారు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశం చివర్లో రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వచ్చిన వెంటనే తాజా పరిణామాలను చంద్రబాబుకు వివరించిన ఆయన, ఆ తర్వాత కొన్ని ఇతర విషయాలను మీతో వ్యక్తిగతంగానే మాట్లాడతానంటూ అధినేతతో చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. 16 ఎమ్మెల్యేల‌తో గంటా భాజాపాలో చేరుతున్నార‌నె ఆరోప‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

న‌లుగురు ఎంపీల విలీనం అనైతికం, అప్రజాస్వామిక‌మని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు టెలీకాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీల విలీనంపై న్యాయ పోరాటానికి సంబంధించిన అంశాలపై పరిశీలిస్తున్నట్లు చంద్రబాబుకు స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -