‘వినయ విధేయ రామ’ భారీ ఫ్లాప్ తర్వాత చాలా టైం తీసుకుని మరీ బాలకృష్ణ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు బోయపాటి శ్రీను. మరో వైపు నందమూరి బాలకృష్ణ కూడా గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.. దాంతో మళ్ళీ తనకు అచ్చోచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను తో చేతులు కలిపాడు బాలయ్య.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.. త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. ఇక బిబి3 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు బాలకృష్ణ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో సిద్ధమవుతున్నారు. కందిరీగ, రభస వంటి సినిమాల్ను చేసి, ఇప్పుడు ఫ్యామిలి, రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు సంతోష్ శ్రీనివాస్.
అయితే ఈ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఓ పవర్ ఫుల్ సబ్జెక్టును బాలకృష్ణ చెప్పగా.. కథ బాగా నచ్చడం తో బాలయ్యకు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ‘బలరామయ్య బరిలో దిగితే..’ అనే టైటిల్ కూడా ఫైనల్ చెసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించడానికి సన్నాహాలు కూడ జరుగుతున్నాయట. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
బాలకృష్ణ కెరీర్ డిజాస్టర్ అయినా సినిమాలు..!
మన స్టార్స్ నోరు జారినప్పుడు.. జరిగిన వివాదం..!