Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌తో కయ్యానికే కాలు దువ్వుతున్న బాలయ్య…. నారా వారి శకుని సారథ్యం

- Advertisement -

2009 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ చాలా మంచోడు. మరీ ముఖ్యంగా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి, ఇమేజ్‌ని ప్రమాదంలో పడేసుకుని మరీ ప్రచారం చేశాడు చూడండి…… అప్పుడైతే….. అబ్బో ఎన్టీఆర్ అంతటోడు లేడు. ఆ తాతకు తగ్గ మనవడే…… ఇవీ ఎన్టీఆర్‌కి చంద్రబాబు ఇచ్చిన సర్టిఫికెట్స్. అయితే ఇవే ప్రశంశలను టిడిపి నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అందరూ ఇవ్వడంతో చంద్రబాబులో ఉన్న కుటిల రాజకీయ నాయకుడు జాగ్రత్తపడ్డాడు. నారా లోకేష్ భవిష్యత్ కోసం ఎన్టీఆర్‌ని బలి చెయ్యడానికి కూడా రెడీ అయిపోయాడు. ఇక ఆ తర్వాత నుంచీ ఎన్టీఆర్‌కి అన్నీ కష్టాలే. బాలయ్య కుటుంబంతో ఎన్టీఆర్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా చిన్నమ్మ వసుంధరకు ఎన్టీఆర్ అంటే అభిమానం. ఇక నందమూరి కుటుంబ సభ్యులు చాలా మంది తారక్‌లో ఆ ఎన్టీఆర్‌ని చూసుకుంటూ అభిమానిస్తారు.

అయితేనేం నారా వారి శకుని సారథ్యం, వ్యూహాల పుణ్యమాని ఇప్పుడు పూర్తిగా శతృవులయిపోయారు. చంద్రబాబుకు వియ్యంకుడు అయిపోయిన బాలయ్యకు చంద్రబాబు ఏం చెప్తున్నాడో తెలియదు కానీ ఎన్టీఆర్‌ని పూర్తిగా శతృవులా ట్రీట్ చేస్తున్నాడు బాలయ్య. స్వర్గీయ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి…ఆయన పదవిని, పార్టీని లాక్కున్న సందర్భంలో కూడా ఇదే బాలయ్యను అడ్డుపెట్టుకుని కుట్రలు రచించాడు చంద్రబాబు. ఆ విషయాలన్నీ చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చాడు. అప్పుడు కూడా బాలయ్య అమాయకంగా ఎన్టీఆర్ వెన్నుపోటు కుట్రలో భాగమయ్యాడన్నది దగ్గుబాటి మాట. ఇక ఇప్పుడు ఈ ఎన్టీఆర్‌కి కూడా అదే స్థాయిలో ద్రోహం చేయడానికి చాలానే ప్రయత్నిస్తున్నాడు బాలయ్య. ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ల సినిమా దసరాకు రిలీజ్ చేస్తారని ముందే తెలుసుకున్న బాలయ్య తన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను కూడా శరవేగంగా దసరాకు రెడీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్‌కి ఎలాంటి సంబంధమూ లేకుండా ఉండేలా చేస్తున్నాడు. మహానటి సినిమాలో ఎన్టీఆర్ పాత్రకోసం జూనియర్ ఎన్టీఆర్‌ని ఆ సినిమా మేకర్స్ సంప్రదించారు. అయితే ఆ విషయం తెలుసుకున్న బాలయ్య మహానటి ప్రొడ్యూసర్ అశ్వినీదత్‌కి వార్నింగ్ ఇచ్చాడట. ఆ దెబ్బతో అసలు నందమూరి కుటుంబానికి సంబంధమే లేని నటుడితో ఎన్టీఆర్ పాత్ర వేయిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యే ప్రతి సందర్భంలోనూ పోటీకి రావడానికి బాలయ్య ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ పరిశీలిస్తూ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్‌కి నష్టం చేయాలన్న ఉద్ధేశ్యంతో తెరవెనుక ఎవరో వ్యూహాలు రచిస్తున్నారని ఇండస్ట్రీ పెద్దలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -