Friday, May 17, 2024
- Advertisement -

పూర్తిగా సావిత్రిగా మారిన కీర్తీ సురేష్‌

- Advertisement -

అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’.ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి.మ‌హ‌న‌టి పాత్ర‌లో హీరోయిన్ కీర్తీ సురేష్ చేస్తుంది. సావిత్రి వేషధారణలో ఉన్న కీర్తి సురేష్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.సావిత్రి కళ్ల ముందు మెదలడం పక్కా. అచ్చు సావిత్రిని పోలిన హెయిర్ స్టైల్- కనుబొమ్మలు- ఫుల్ జాకెట్ ధరించి చూసేవారిని ఇట్టే కట్టిపడేస్తోంది కీర్తి సురేష్. మ‌హ‌న‌టి సావిత్రిగా క‌నిపించ‌డం అంటే మామూలు విష‌యం కాదు, ఈ విష‌యం కీర్తీకి తెలుసు.సినిమా మొద‌లు పెట్టిన‌ప్పుడు కీర్తీ సురేష్‌పై విమ‌ర్శ‌లు చాలానే వ‌చ్చాయి.

ఇప్పటికే జర్నలిస్టు మధురవాణి పాత్రలో సమంత… అమె ప్రేమికుడి పాత్రలో విజయ్ దేవరకొండ పాత్రల పోస్టర్లను విడుదల చేసిన చిత్ర బృందం ఇప్పుడు సావిత్రి లుక్కులో ఉన్న కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదల కాబోతోంది. ఈ సినిమాకు నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -