Tuesday, May 14, 2024
- Advertisement -

అమెరికాలో పుట్టిన రోజు వేడుకలు

- Advertisement -

ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలక్రష్ణ అమెరికాలోని సిలికాన్ వ్యాలీ చేరుకున్నారు. భార్య వసుంధరతో కలిసి అమెరికా పర్యటనలో భాగంగా సిలికాన్ వ్యాలీ వెళ్లిన బాలక్రష్ణకు అక్కడి  ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బాలక్రష్ణ ఉండే హొటల్ వరకూ కార్లతో ర్యాలీ నిర్వహించారు.

బుధవారం నాడు ఆయన శాన్ హోజే కన్వేక్షన్ సెంటర్, బయోటెక్ పార్క్ వంటివి సందర్శించారు. శుక్రవారం నాడు బాలక్రష్ణ పుట్టిన రోజు. ఈ వేడుకలను ఆయన బే ఏరియాలోని ఇండియా కమ్యూనిటీ సెంటర్లో నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ఆయన సీయాటెల్ లో పర్యటించి హైదరాబాద్ లోని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -