Saturday, May 18, 2024
- Advertisement -

షణ్ముకా ఫిలిమ్స్ దక్కిన అవకాశం

- Advertisement -

కబాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కొత్త చిత్రం. ఈమధ్యనే విడుదలైన టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. నిజానికి ఈ సినిమాను ప్రకటించినప్పుడే తమిళ, తెలుగు ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చేశారు. పా రంజిత్ దర్శకత్వంలో తమిళ కలైఫుల్ ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. దీన్ని తెలుగు హక్కులు పొందేందుకు మన నిర్మాతలు, పంపిణీ సంస్ధల మధ్య ఎంతో పోటీ పెరిగింది. దీంతో హక్కుల ధరలు కూడా ఆకాశాన్నంటాయి.

ఇంత పోటీని తట్టుకుని చివరు షణ్ముఖా ఫిలిమ్స్ సంస్ధ కబాలి హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ సంస్ధ ఇంతవరకూ ఏ డబ్బింగ్ చిత్రానికి చెల్లించనంత మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. గతంలో రజనీ కాంత్ నటించిన రోబో చిత్రానికి భారీగా ధర పలికింది. దాని తర్వాత మళ్లీ రజనీ చిత్రం కబాలీ ఆ రికార్డులను మార్చివేసింది.

ఈ నెల 12న కబాలి చిత్రం పాటలను ఆన్ లైన్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఇందులో రజనీకాంత్ భార్యగా రాధికా ఆప్టే నటించడం విశేషం. జూలై మొదటి వారంలో ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -