- Advertisement -

హైప‌ర్ ఆదికి పిలిచి మ‌రి వార్నింగ్ ఇచ్చిన‌ బాల‌య్య ..?

- Advertisement -

ప్ర‌ముఖ ఈటీవీ చానెల్లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ ప్రొగ్రామ్ ద్వారా ఫేమ‌స్ అయిన వారిలో హైప‌ర్ ఆది కూడా ఒక‌రు. మొద‌ట కంటెస్టెంట్‌గా వ‌చ్చిన ఆది త‌రువాత కాలంలో త‌న టాలెంట్‌తో టీం లీడ‌ర్‌గా మారాడు. హైప‌ర్ ఆది స్కిట్‌ల‌కు , అత‌ను వేసే పంచ్‌ల‌కు క‌డుబుబ్బ న‌వ్వుకొవాల్సిందే. త‌ద్వారా చాలామంది అభిమానుల‌నే సంపాదించాడు ఆది. యూట్యూబ్‌లో ఆది స్కిట్‌ల‌కు ల‌క్ష‌ల్లో వ్యూస్ కూడా వ‌స్తుంటాయి. ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది కాని, ఆది కావాలనే కొన్ని స‌మ‌స్య‌ల‌ను కొన్ని తెచ్చుకుంటున్నాడ‌ని చాలామంది అంటున్నారు. ఇటీవ‌ల కాలంలో ఆదికి టీడీపీ ఎమ్మెల్యే,హీరో బాల‌కృష్ణ ఆదిని పిలిచి మ‌రి వార్నింగ్ ఇచ్చిన‌ట్లు వార్తలు వ‌చ్చాయ‌. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు కాని, ఈ వార్త మాత్రం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది.

దీంతో హైప‌ర్ ఆది దీనిపై స్పందించాడు. నాకు బాల‌య్యగారు వార్నింగ్ ఇచ్చిన మాట‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని ఆయ‌న తెలిపాడు. గ‌తంలో బాల‌య్య గారిపై ఓ స్కిట్ చేసిన వాస్త‌మే. అప్ప‌ట్లో ఆయ‌న అభిమాని వార్నింగ్ ఇచ్చిన మాట వాస్త‌వ‌మే అని హైప‌ర్ ఆది చెప్పుకొచ్చాడు. గ‌తంలో కూడా ఆది ఇలాంటి వివాదాల్లో చాలా వాటిల్లో ఇరుకున్నాడు. క‌త్తి మ‌హేశ్ వివాదంలో ఆది కావాల‌నే దూరడాని చాలామంది అంటుంటారు. ఇక ఆదికి న‌చ్చ‌ని వారు ఉంటే త‌న స్కిట్‌ల‌లో వారిపై పంచ్‌లు వేస్తాడ‌ని చాలామంది చెబుతుంటారు. దీంతో సినీ ఇండ‌స్ట్రీలోని ఓ వ‌ర్గం ఆదిని దూరం పెట్టార‌ని ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. మరి ఇప్ప‌టికి అయిన ఆది త‌న ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకుంటాడో లేదో చూడాలి.

https://www.youtube.com/watch?v=jQ5snMST7js

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -