Wednesday, April 17, 2024
- Advertisement -

మరింత ఆలస్యం గా రానున్న బాలయ్య ‘రూలార్’

- Advertisement -

ఈ పాటికి బాలకృష్ణ నూతన చిత్రం ప్రారంభం కావాల్సింది కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఈ సినిమా అనుకున్న సమయానికి మొదలు అయ్యేలా కనిపించడం లేదు. మొదట బోయపాటి దర్శకత్వం లో సినిమా చేయాలనీ చూసిన బాలకృష్ణ ఆ తర్వాత జై సింహ కి పని చేసిన కె ఎస్ రవికుమార్ తో సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేసాడు. సి కళ్యాణ్ నిర్మాణం లో ఈ సినిమా అధికారికం గా కన్ఫర్మ్ చేసినా కానీ ఎందుకో ఈ సినిమా మొదలు కావడానికి ఇంకా సమయం పట్టనుంది అనే విషయం తెలుస్తుంది.

బయట ఎన్నో కారణాలు ఉన్నప్పటీకీ ప్రస్తుతం ఈ సినిమా కథ కి మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా లో కొన్ని రాజకీయ అంశాలని టచ్ చేసినట్లు తెలుస్తుంది. దాని ప్రకారం తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వస్తుంది అనే భావన తో కొన్ని సీన్లు రాసుకున్నారట దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు జగన్ అధికారం లో కి రావడం తో, సినిమా లో ని విలన్ పాత్ర కాస్త అతనికి వ్యతిరేకం గా అనిపించే ఆస్కారం కూడా ఉండటం తో అనవసరం గా వివాదం లోకి వెళ్లడం మంచిది కాదు అనే ఉదేశ్యం తో చిత్ర యూనిట్ ప్రస్తుతం కథ కి మార్పలు చేస్తున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -