Thursday, May 16, 2024
- Advertisement -

బాలయ్య ప్రొడ్యూసర్లకు లాభాలే లాభాలు…!

- Advertisement -

బాలయ్య హీరోగా వస్తున్న 99 వ సినిమా ‘డిక్టేటర్’. సంక్రాంతి విడుదలకు షెడ్యూల్ అయిన ఈ సినిమా వ్యాపారం గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. విడుదలకు ముందే నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెడుతోందట ఈ సినిమా.  28 కోట్ల రూపాయలతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే 35 కోట్ల రూపాయల వరకూ బిజినెస్ చేసినట్టుగా తెలుస్తోంది.

బాలయ్య గత సినిమా ఫెయిల్యూర్ అయినా.. ఈ సినిమా మాత్రం పాజిటివ్ మార్కెట్ లో విడుదల అవుతోంది. దీంతో ఏకంగా 35 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్టుగా తెలుస్తోంది.ఓవరాల్ గా బాలయ్యతో సినిమాను రూపొందించిన ప్రొడ్యూసర్లకు ఇప్పటికే ఏడు కోట్ల రూపాయల లాభాలు చేతికందాయని వినికిడి.

శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సోనల్ చౌహాన్, అంజలిలు నటించారు. ఈ సినిమా ఆడియోను ఆంధ్రుల నూతన రాజధాని అమరావతిలో విడుదల చేయనున్నారు.

ఈ విధంగా ఈ సినిమా తెలుగు వారి నూతన రాజధానిలో ఆడియో ఫంక్షన్ జరుపుకుబోతున్నది గా నిలుస్తోంది. మరి ఇప్పుడు వ్యాపారం విషయంలో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. బాలయ్య అభిమానులను ఆనంద పెడుతోంది! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -