Saturday, May 11, 2024
- Advertisement -

ఓవర్సీస్ లో బాలయ్య ‘లయన్’ కలెక్షన్ల రికార్డు!

- Advertisement -

నందమూరి నటసింహం తాజా సినిమా ‘లయన్’ ఓవర్సీస్ లో కలెక్షన్ల రికార్డును సృష్టిస్తోంది. భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమా అక్కడ అభిమానులను ఆకట్టుకొంటోంది. భారీ అంచనాలతో వారు థియేటర్ల బాట పట్టడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

తొలి రోజు వరకూ అయితే ఈ సినిమా… బారీ గానే వసూలు చేసుకోగలిగింది. అమెరికా, కెనడాల్లో కలిసి దాదాపు రెండు కోట్లరూపాయలపై మొత్తాన్ని సాధించింది ‘లయన్’.

అమెరికా, కెనాడల్లో ఈ సినిమా మొత్తం 70 స్క్రీన్లలో విడుదల అయ్యింది. అక్కడ ఉన్న తెలుగు వారిని థియేటర్ల బాట పట్టించింది. ఓవరాల్ గా తొలిరోజునే రెండు కోట్ల రూపాయల పై స్థాయికి చేరింది. గతంలో బాలయ్ సినిమా ‘లెజెండ్’ దాదాపు 60 థియేటర్లలో విడుదల కాగా.. ఈ సారి థియేటర్ల సంఖ్య పెరిగింది. 

మరి తొలి రోజే రెండుకోట్ల రూపాయలు అంటే.. వారంతంలో కూడా ఈ సందడి కొనసాగుతుందనే చెప్పాలి. దీంతో బాలయ్య ఈ సినిమాతో తన పాత రికార్డులను బ్రేక్ చేస్తున్నట్టే.. కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నట్టే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -