బండ్ల గణేష్ .. తెలుగు సినీ జనాలకు బాగా తెలిసిన పేరు. నటుడిగా , నిర్మాతగా, రాజకీయనాయకుడిగా, వ్యాపారవేత్తగా ఇలా తనలోని అన్ని కోణాలను బయటపెట్టి మరి రాణించాడు బండ్ల గణేష్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బండ్ల గణేష్. ఆ సమయంలో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అయినప్పటికి పార్టీ తరుపున మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అనర్గళంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో తన పీక కోసుకుంటానని చెప్పి సంచలనం రేపారు.
తీరా ఎన్నికల ఫలితాలు బండ్ల గణేష్‌కు షాకిచ్చాయి. దీంతోఆయన కొంతకాలం మీడియా నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. తాను రాజకీయల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు బండ్ల గణేష్. నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, పార్టీలో నాకు అవకాశం ఇచ్చినందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞాతలు తెలిపాడు బండ్ల గణేష్. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉండే క్షమించమని కోరారు బండ్ల గణేష్.
- Advertisement -
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బండ్ల గణేష్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -