Tuesday, April 23, 2024
- Advertisement -

నిజంలో నన్ను మోసం చేశారు.. డైరెక్టర్ తేజ పై రాశి ఫైర్..!

- Advertisement -

నటి రాశి.. దాదాపు సినీయర్ హీరోలందరి సరసన ఆమె నటించింది. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళం హిందీ లో కూడా సినిమాలు చేసింది. పెళ్లి తరువాత చాలా వరకు సినిమాలు చేయడం తగ్గించేసింది. పరిచయమైన మొదటి సంవత్సరంలోనే 10 సినిమాలు చేసిన రాశి ఎక్కువ కాలం తన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది.

2003లో వచ్చిన మహేష్ బాబు నిజం సినిమాలో రాశి చేసిన పాత్ర అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అప్పటివరకు హోమ్లీగా నటించిన రాశి ఈ నిజం సినిమాలో బోల్డ్ గా కనిపించింది. నిజం సినిమాలో రాశి ఆ విధంగా కనిపించడానికి కారణం రాశికి దర్శకుడు చెప్పినట్లుగా తీయలేదట. ముందు దర్శకుడు ఒక లవ్ స్టోరీ అని చెప్పి ఆ తరువాత పూర్తిగా ఆ పాత్ర శైలిని మార్చేసి మోసం చేశారట. పలు ఇంటర్వ్యూలలో కూడా రాశి ఆ పాత్ర వెనుక జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పింది.

షూటింగ్ మొదటి రోజే వెళ్లిపోదామనుకున్న రాశి అడ్వాన్స్ తీసుకొని కమిట్ అయిన పాత్రను అలా చేయకుండా వెళ్లిపోతే బావుండదు అని ఇష్టం లేకపోయినా ఆ పాత్రను చేసినట్లు వివరణ ఇచ్చింది. ఇక రంగస్థలంలో అనసూయ పాత్ర ముందు తనకే ఆఫర్ వచ్చిందని.. కానీ ఆ పాత్ర నచ్చక ఒప్పుకోలేదన్నారు. అయితే భవిష్యత్తులో మాత్రం ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నదియా లాంటి పాత్రలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిపిస్తానని రాశి చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -