Friday, April 26, 2024
- Advertisement -

నగ్న పాత్రను చేశా.. ఇప్పుడు అంతకు మించి చేస్తా : అమలా పాల్

- Advertisement -

సినీ పరిశ్రమలో హీరోయిన్స్ కెరీర్ ఎప్పుడు ఒకేలా ఉండదు. అవకాశాలు వస్తే హద్దులు దాటకుండా రాణించిన హీరోయిన్స్ అవకాశాలు లేకుంటే హద్దులు దాటేస్తారు. కొందరు ముందు నుంచే గ్లామర్ గా బికినీలో కూడా కనిపిస్తారు. ఇక మరికొందరు నగ్నంగా నటించడానికి కూడా సై అంటూ ఉంటారు. ఇక హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ గ్లామర్ పాత్రలో కూడా నటిస్తోంది. ఆమె అనే సినిమాలో బోల్డ్ గా నగ్నంగా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది అమలపాల్. అసలు ఆ పాత్రలో నటించింది నిజంగా అమెనేనా అనే అనుమానం కలిగింది. పాత్ర డిమాండ్ చేస్తే ఎంత బోల్డ్ గా కనిపించడానికైనా సిద్ధమే అంటూ మరోసారి అమ్మడు హాట్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం లాక్ డౌన్ లో విశ్రాంతి తీసుకుంటున్న అమ్మడు తనపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక పాత్రలు డిమాండ్ చేస్తే.. ఆమె సినిమాలో కనిపించిన పాత్రను అందరూ మర్చిపోయేలా నటించి చూపిస్తా అని వివరణ ఇచ్చింది.

డైరెక్టర్ విజయ్ ని లవ్ చేసి పెళ్లాడిన అమలా పాల్ రెండేళ్లకే అతనికి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరో వ్యక్తిని ఈ బ్యూటీ పెళ్లాడబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ పై అమలా పాల్ చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ గాసిప్స్ వస్తుండడంతో ఒకానొక సమయంలో మీడియాపై సీరియస్ అయ్యింది. నా పర్సనల్ లైఫ్ గురించి నా ఇష్టం అది బయటపెట్టడం తనకి ఇష్టం లేదని చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -