Friday, May 17, 2024
- Advertisement -

తెరవెనుక ఎన్నోకష్టాలుంటాయి

- Advertisement -

ఇటీవల కాలంలో జనాలు ఎక్కువగా ముచ్చ టించుకున్న సినిమా ‘హేట్‌స్టోరి 2. ముఖ్యం గా ఈ సినిమాలో కథానాయిక సుర్విన్‌చావ్లా  గురించి  చాలా  చెప్పుకున్నారు. అమ్మడికి సిగ్గు, బిడియం అంటేనే తెలియదు. గ్లామర్‌ ఒలకబోయడానికి బాగా తెగించింది.

పెదవి ముద్దులు, ఘాటైన బెడ్‌రూమ్‌ సన్నివేశాల్లో  జీవించేసింది….అని అందరూ మాట్లాడారు. అయితే  వీటన్నిటి  వెనుక  ఎంత  కష్టం ఉంటుందో సుర్విన్‌ స్వయంగా చెప్పింది.
     ”వెండితెరపై మహారాణిలా కనిపించినా తెరవెనుక ఎన్నో కష్టనష్టాలుంటాయి, బాధలుంటాయి. రాత్రనకా,  పగలనకా శ్రమించాలి. ఎన్ని కష్టాలున్నా పెదవులపై చిరునవ్వు మెయింటేన్‌ చేయాలి. బయట చూసేవాళ్లకు అవేవీ  తెలియవు. కథానాయిక జీవితం అంటే చాలా కష్టం  అనిచెప్పింది. పంజాబీ అమ్మాయిగా అసలు ఏమీ తెలియని ముంబై లో అడుగుపెట్టాక కాస్త భయపడ్డాను. ఇక్కడ నాకు ఎవరూ పరిచయం లేరు. అయినా ఏదోలా నెగ్గుకొచ్చాను. సినిమా అవకాశాలు అందిపుచ్చుకున్నానుఅని ఆమె వివరించింది. ”చిన్నప్పటినుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. బాగా ప్రాక్టీస్‌చేసేదాన్ని. అస్సలు సినిమాల్లోకి వస్తానని నేను ఎపుడఅనుకోలేదు. కానీ ఎందుకనో గాలిమల్లింది. వచ్చేశాను అని చెప్పుకొచ్చింది ఈ హాట్‌గర్ల్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -