Thursday, May 9, 2024
- Advertisement -

అల్లుడు శీను త్వరలో ఒక ఇంటికి అల్లుడు అవ్వనున్నాడట

- Advertisement -

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. అల్లుడు శీను సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ నిన్న మొన్నటి దాకా వరుస డిజాస్టర్ లతో సతమతమయ్యాడు. అయితే ఈ మధ్యనే ‘రాక్షసుడు’ సినిమాతో ఎట్టకేలకు ఒక మంచి హిట్ అందుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తమిళ్ ‘రాట్సాసన్’ సినిమాకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకి ముందు కూడా ఏమంత బజ్ క్రియేట్ చేయని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం బాగానే వసూలు చేస్తోంది.

హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇన్నాళ్లకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మంచి సక్సెస్ దక్కడంతో బెల్లంకొండ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయగా, ఆ వేడుకలో మాట్లాడుతూ బెల్లంకొండ సురేష్ బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి మాట ఎత్తడం ఆసక్తికరంగా మారింది. “త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్ కి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇండస్ట్రీ అమ్మాయిని కాకుండా బయట అమ్మాయిని చూసి శ్రీనివాస్ పెళ్లి చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు బెల్లంకొండ సురేష్. ఇప్పుడిప్పుడే కెరీర్ లో సక్సెస్ చూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి అప్పుడే పెళ్లి ఏంటి అని కూడా కొందరు ఆశ్చర్య పడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -