- Advertisement -

భాగ్యశ్రీ బోర్సే.. ‘లెనిన్’ పై ఆశలు!

- Advertisement -

రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ, ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చుకుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయినప్పటికీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత వరుసగా విజయ్ దేవరకొండ (కింగ్‌డమ్), దుల్కర్ సల్మాన్ (కాంత), రామ్ పోతినేని (ఆంధ్ర కింగ్ తాలుకా) వంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. కాగితం మీద ఇవి అద్భుతమైన ప్రాజెక్ట్‌లే అయినప్పటికీ, అదృష్టం కలిసిరాక ఆమె ఖాతాలో వరుసగా నాలుగు ఫ్లాపులు చేరాయి.

ఈ పరిస్థితుల్లో ఆమె టాలీవుడ్ భవిష్యత్తు ఇప్పుడు ఒక్క సినిమాపైనే ఆధారపడి ఉంది, అదే ‘లెనిన్’.అక్కినేని అఖిల్ హీరోగా, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక రా అండ్ రస్టిక్ రూరల్ మాస్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో భాగ్యశ్రీ పోషిస్తున్న గ్రామీణ యువతి పాత్ర కథలో చాలా బరువున్న పాత్ర అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో భాగ్యశ్రీ తన శాయశక్తులా కృషి చేస్తోంది. సెట్స్‌లో ఆమె నటన చూస్తుంటే ఈ సినిమా కోసం ఎంత శ్రమిస్తుందో అర్థమవుతోందని చిత్ర బృందం అంటోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో అఖిల్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘లెనిన్’తో భాగ్యశ్రీ తన కెరీర్‌లో ఆశించిన కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌ను అందుకుంటుందా? లేదా చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -