Thursday, May 16, 2024
- Advertisement -

కారులో హీరోయిన్ భావ‌న.. అరెస్ట్ అయిన హీరో

- Advertisement -

దక్షిణాది సినిమాల్లో.. తెలుగులో నటించిన ప్రముఖ హీరోయిన్ ను కారులో లైంగిక వేధించిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కేరళ పోలీసులు ప్రముఖ మలయాళ హీరో దిలీప్‌ అరెస్ట్‌ చేశారు. ప్రముఖ నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్‌ కేసులో దిలీప్‌ నిందితుడిగా ఉన్నారు. చివరకి ఈ కేస్ లో ఆయన ప్రమేయం ఉందని తెలడంతో.. ఆయన్ను అరెస్ట్ చేశారు.

ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న బాధిత నటిని కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు లైంగికంగా వేధించారు. అశ్లీల ఫొటోలు తీశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన పల్సర్‌ సుని అనే వ్యక్తిని, నటి వాహనం డ్రైవర్‌ మార్టిన్‌తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వెనుక పలువురు సినీ పెద్దల హస్తముందని గతంలోనే కథనాలు వినిపించాయి. ఈ క్రమంలో ప్రముఖ హీరో దిలీప్‌ను రెండువారాల కిందట పోలీసులు 12 గంటలపాటు విచారించారు. వ్యక్తిగత కక్షతోనే నటిని కిడ్నాప్‌ చేయించి.. వేధించేందుకు ఆయన కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో దిలీప్‌ను అరెస్టు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.

షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్తున్న భావనను కిడ్నాప్ చేసేందుకు ఆమె దగ్గర గతంలో డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తితో పాటు స్థానిక రౌడీషీటర్ ఒకరు యత్నించారు. ఆమె కారులోనే ఎక్కి లైంగికంగా వేధించి ఫొటోలు, వీడియోలు తీశారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు దిలీప్ భార్య, నటి కావ్య కార్యాలయంలో కూడా ఇటీవలే తనిఖీలు చేశారు. చివరకు ఈ కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను అరెస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -