Monday, April 29, 2024
- Advertisement -

రష్మిక దగ్గర ట్యూషన్ కి వెళ్తున్న హీరో

- Advertisement -

వరుసగా “లై”, “ఛల్ మోహన్ రంగ”, “శ్రీనివాసకల్యాణం”.. ఇలా వరుసగా 3 ఫ్లాపులు రావడంతో ఒక్కసారిగా నితిన్ తన కెరీర్ లో ఉక్కిరిబిక్కిరి అయినా విషయం వాస్తవమే. కాకపోతే ఈ యువ కథానాయకుడు ఏ మాత్రం బెరుకు లేకుండా కాస్త గ్యాప్ తీసుకొని, తిరిగి సినిమాలు సైన్ చేయడం మొదలు పెట్టాడు. ఏడాది తర్వాత భీష్మ అనే సినిమాతో సెట్స్ పైకి వచ్చాడు నితిన్. చలో సినిమా తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన వెంకీ కుడుములు ఈ సినిమా కి దర్శకుడు. రష్మిక మందన్న ఈ సినిమా లో హీరోయిన్.

రష్మిక ఇంతకు ముందు వెంకీ తో కలిసి పని చేసింది కానీ నితిన్ పక్కన నటించడం ఇదే మొదటి సారి. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగం గా సాగుతుంది. షూటింగ్ లో భాగం గా రష్మిక నితిన్ కి ట్యూషన్ చెప్తుంది అని తెలుస్తుంది. అయితే హీరో హీరోయిన్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, వారు ఏమి చేస్తుంటారు అనే విషయం మీద క్లారిటీ లేదు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -