Tuesday, June 18, 2024
- Advertisement -

మూడు నెలల పరీక్ష కి తయారు అవుతున్న చిరంజీవి

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సై రా నరసింహ రెడ్డి సినిమా కి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేసుకొని తన తదుపరి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్న విషయం తెలిసిందే. త్వరలో నే చిరంజీవి దర్శకుడు కొరటాల శివ తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ కచ్చితం గా సై రా విడుదల తర్వాత మాత్రమే ఉంటుంది అని వినికిడి. ఇది అంతా పక్కన పెడితే ఈ నూతన చిత్రం కోసం చిరంజీవి తన శరీర ఆకృతి ని ఇప్పటి నుంచే మార్చుకుంటున్నారు.

ఈ సినిమా లో చిరంజీవి డబుల్ యాక్షన్ చేస్తున్నారు అనే టాక్ నడుస్తున్నా కచ్చితంగా మాత్రం ఆయన పాత్ర తీరుతెన్నెలు మనకి తెలియదు. కాకపోతే సై రా షూటింగ్ అయిన వెంటనే ఏ మాత్రం గాప్ తీసుకోకుండా వెంటనే ఈ కొత్త చిత్రం కోసం కసరత్తులు మొదలు పెట్టాడు.

అయితే నవంబర్ నెల లో ఈ సినిమా షూటింగ్ మొదలు అవుతుంది అనే టాక్ ఉంది కాబట్టి చిరంజీవి ఇప్పటి నుంచే తన శరీరాన్ని మార్చుకోవడం వలన ఉపయోగం ఏంటి అనే విషయం అర్ధం కావడం లేదు. ఇప్పుడు ఎలా అయితే ఫిట్ గా ఉన్నారో,అదే లుక్ ని మరో మూడు నెలలు ఏ మాత్రం చేంజ్ లేకుండా ఆయన మైంటైన్ చేయాలి అంటే కష్టమే మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -