Friday, March 29, 2024
- Advertisement -

వ‌దిన‌.. అక్క‌.. ఇప్పుడు దెయ్యంగా ఒక‌ప్ప‌టి హీరోయిన్‌

- Advertisement -

టాలీవుడ్‌లో రీ ఎంట్రీతో భూమికకు క‌లిసివ‌చ్చింది. నానికి వ‌దిన‌గా న‌టించిన ఎంసీఏ సినిమాతో టాలీవుడ్‌లోకి మ‌ళ్లీ భూమిక వ‌చ్చేశారు. ఆ సినిమా సూప‌ర్‌హిట్ కావ‌డంతో భూమిక‌కు వ‌రుస సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం రెండు, మూడు సినిమాల‌తో భూమిక బిజీ అయ్యారు.

ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌కు అక్క‌గా ‘స‌వ్య‌సాచి’ సినిమాలో భూమిక అక్క‌గా న‌టించింది. ఇప్పుడు మ‌రో సినిమాలో భూమిక దెయ్యంగా క‌నిపించ‌నున్నారు. సమంత న‌టిస్తున్న సినిమా ‘యూటర్న్’. కన్నడలో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ థ్రిల్లర్ సినిమాను తెలుగు, తమిళ్‌లో రీమేక్ చేస్తున్నారు. క‌న్న‌డ‌లో తీసిన ద‌ర్శ‌కుడు పవన్‌కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. కన్నడలో రాధికా చేతన్ పోషించిన పాత్రను భూమిక చేయ‌నున్నారు. ఈ పాత్ర ఒక దెయ్యం కావడంతో భూమిక ఎలా న‌టిస్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -