Friday, May 3, 2024
- Advertisement -

చైతూ అక్క‌గా నాని వ‌దిన‌

- Advertisement -
  • ‘సవ్యసాచి’ లో భూమిక‌

మిడిల్ క్లాస్ అబ్బాయ్‌ ‘ఎం.సి.ఏ’ సినిమా విజ‌యంతో భూమికకు తెలుగు సినీ అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె న‌ట‌న‌తో ఎంసీఏలో ఆక‌ట్టుకున్న ఆమెకు మ‌రో సినిమా అవ‌కాశం వ‌చ్చింది. నానికి వ‌దిన‌గా న‌టించిన ఆమె త్వ‌ర‌లో ఓ సినిమా అక్క‌గా క‌నిపించ‌నున్నారు.

ఖుషీ, సింహాద్రి, మిస్సమ్మల‌తో ఆక‌ట్టుకున్న ఆమె మ‌ళ్లీ సినీ ప‌రిశ్ర‌మ‌లో రాణించేందుకు శ్ర‌మిస్తున్నారు. హిందీ ధోని సినిమాలో ధోని అక్క‌గా న‌టించిన ఆమె ఆ త‌ర్వాత తెలుగుకు వ‌చ్చారు. ‘ఎం.సి.ఏ’ సినిమాతో ఇప్పుడు తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో ఆమె పాత్ర‌కు బాగానే మార్కులు పడ్డాయి. ప్రస్తుతం భూమిక తన తదుపరి సినిమాలో నాగచైతన్యకు అక్కగా నటించ‌నున్నారు.

కార్తికేయ సినిమా ద‌ర్శ‌కుడు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ‘సవ్యసాచిస సినిమా తీస్తున్నారు. అయితే ఈ సినిమాలో చైతూ అక్క‌గా భూమిక క‌నిపించనున్నారు. ఇప్పుడు లొకేషన్ నుంచి చైతన్యతో భూమిక ఉన్న ఓ ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -