Friday, April 26, 2024
- Advertisement -

కుమారుడికి `ఊపిరి`నిచ్చిన నాగార్జున‌

- Advertisement -

అఖిల్ హ‌లో సినిమా విజ‌యం

మొత్తానికి అక్కినేని రెండో వార‌సుడికి హ‌లో సినిమా తొలి విజ‌యం ద‌క్కింది. విజ‌యం అంటే విజ‌య‌మే. అంతేకానీ సూప‌ర్‌.. బంప‌ర్ అనే ట్యాగ్‌లు ఏమీ లేదు. దీంతో అక్కినేని కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమా కోసం అక్కినేని కుటుంబమంతా చాలా క‌ష్ట‌ప‌డింది. సినిమా క‌థ ఎంపిక నుంచి సంగీత ద‌ర్శ‌కుడు, హీరోయిన్, న‌టీన‌టుల ఎంపిక త‌దిత‌ర వంటి విష‌యాల‌న్నీ ద‌గ్గ‌రుండి అఖిల్ తండ్రి నాగార్జున చూసుకున్నారు.

అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మించడంతో అన్నీ ప‌నులు నాగార్జున‌నే చూసుకున్నారు. సినిమా పూజా కార్య‌క్ర‌మాల నుంచి థియేట‌ర్ల‌లో విడుద‌ల వ‌ర‌కు అన్నీ తానై నాగార్జున వ్య‌వ‌హరించారు. దాదాపు రెండేళ్ల త‌ర్వాత త‌న చిన్న కొడుకుకు విజ‌యం ఇవ్వాల‌నే ల‌క్ష్యంతో ముంద‌డుగు వేశారు. త‌మ కుటుంబాన్నంతా మ‌నం సినిమాలో బంధించిన, అక్కినేని కుటుంబానికి ఓ జ్ఞాపిక మిగిల్చాడు విక్రమ్‌ కె కుమార్‌. అత‌డి ద‌ర్శకత్వంలోనే హ‌లో సినిమాను తీశారు. ఈ సినిమాకు మ్యూజిక్ అనూప్ రూబెన్స్ అందించాడు. అయితే ఈ సినిమా స‌మ‌యంలో ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయ్ సినిమా విడుద‌ల అవ‌డంతో కొంచెం ఆందోళ‌న‌లో ఉన్న నాగార్జున ఎట్ట‌కేల‌కు త‌న కుమారుడికి ఓ హిట్‌ను అందించారు.

హలో సినిమా మొత్తానికి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే అక్కినేని అభిమానులు మాత్రం ఇంకా పూర్తిగా సంతృప్తి చెందలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ స్థాయి హిట్ సరిపోదు. సినిమాకు కలెక్షన్స్ కూడా అంత గొప్పగా ఏమి రాలేవు. కానీ ప్రమోషన్స్‌తో సినిమా నష్టపోకుండా కలెక్షన్స్‌ని రాబడుతోందని చెప్పవచ్చు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -