Wednesday, May 15, 2024
- Advertisement -

బిగ్‌బాస్ హౌస్‌లోనూ దేవుళ్ల జోలికి వెళ్లి అబాసుపాలు

- Advertisement -

బాబూ గోగినేని.. త‌న‌కు తానో మేథావిగా భావించుకునే మ‌న‌స్త‌త్వం ఉన్న వ్య‌క్త‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది. బిగ్ బాస్ హౌస్‌లో క‌నీస లోక‌జ్ఞానం లేని తోటి కంటెస్టెంట్‌ల‌ను త‌న మాట‌ల‌తో ఆక‌ట్టి.. ఇప్పుడు హౌస్‌ను త‌న చెప్పు చేత‌ల్లోనికి తెచ్చుకుని ఆడిస్తున్నాడు. అయితే.. హౌస్‌లో ఉంటూ ఈయ‌న చేసే విన్యాసాలు ఇప్పుడు.. చూసేవారికి ప‌ర‌మ చిరాకు తెప్పిస్తున్నాయి. బిగ్‌బాస్‌ను కోట్లాది మంది వీక్షిస్తున్నార‌నే స్ర్ప‌హ లేకుండా.. కెమెరా ముందు ముఖం పెట్టి.. తాను ఎంద‌రితోనూ టీవీ ఛానెళ్ల డిబేట్ల‌లో మూడు చెరువుల నీళ్లు తాగించిన ఘ‌నుడినంటూ త‌న నోటితో త‌న గురించి డ‌బ్బా వాయించుకున్నాడీ మేథావి.

అంత‌టితో ఆగాడా.. అంటే.. అబ్బే. తాజాగా తనది తెలుగు వాళ్ల స్థాయి కాద‌ని.. తానో ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌ర్స‌నాలిటీ అంటూ అబ్బో వాయించి వాయించి చెవుల్లో ర‌క్తం కారేలా.. డ‌బ్బా కొట్టాడు. తాను ఏదో తెలుగు మాట్లాడుతున్నాను కాబ‌ట్టి మీ స్థాయి వాడిన‌నుకుంటున్నారేమో.. అంటూ ప‌ర‌మ చెత్త‌గా వాయించుకున్నాడు. పొద్ద‌స్త మానం బిగ్‌బాస్ హౌస్‌లో ఒక‌రిద్ద‌రు త‌న మాట వినేవాళ్ల‌ను వెంట‌నేసుకుని.. వారిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ.. హౌస్‌లో బ‌లంగా ఉన్న కౌశ‌ల్‌, గీతామాధురి లాంటి వాళ్ల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగాల‌ని తెగ స్కెచ్‌లు గీస్తున్నాడీ అప‌ర మేథావి. బాబూ గోగినేని పైత్యం పీక్స్‌కు వెళ్లిపోయింద‌ని, అత‌డిని అరెస్ట్ చేయాలంటూ.. హిందుత్వ వాదులు న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించి.. అత‌నిపై కేసులు బ‌నాయిస్తుంటే.. ఈసారుకు అవేవీ తెలియ‌వు క‌దా. అందుకే.. బిగ్‌బాస్ హౌస్‌లో తోటి కంటెస్టెంట్ కౌశ‌ల్ లాంటి వాళ్ల‌ను ఎలా బ‌య‌ట‌కు పంపాలా.. అని తెగ ఆలోచిస్తూ.. వ్యూహాలు ర‌చిస్తున్నారిప్పుడు.

ఈ వారం ఎలిమినేష‌న్ జాబితాలోనికి వ‌చ్చిన బాబూ గోగినేని ఖ‌చ్చితంగా త‌న లూజ్ టంగ్ వ‌ల్ల ఇంటికి వెళ్లిపోతాడ‌ని అంతా భావించారు. కానీ.. వైల్డ్‌కార్డ్ రీ ఎంట్రీ వ‌ల్ల‌.. ఈసారి ముప్పు నుంచి త‌ప్పించుకున్నాడు. లేదంటే.. కౌశ‌ల్‌ను దారుణంగా అవ‌మానించేలా మాట్లాడ్డంతో అత‌ని అభిమానులు ఒక‌వైపు ఫైర్ అవుతుంటే, మ‌రోవైపు అత‌డిని బిగ్‌బాస్ హౌస్‌లోనుంచి బ‌య‌ట‌కు గుంజేయాల‌ని హిందుత్వ వాదులు పావులు క‌దుపుతున్నారు. పైగా.. ఈసారు చెప్పుకునేంత పెద్ద తానో ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌ర్స‌నాలిటీ అనే విష‌యం ఆయ‌న సంబ‌ధీకుల‌కు త‌ప్ప పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. మ‌న తెలుగువాళ్ల‌కు ఆయ‌న కేవలం ప‌నీపాటా లేని టీవీ ఛానెళ్ల‌లో పొద్ద‌స్త‌మానం కూర్చుని ఏదో సోది చెబుతుంటాడ‌ని మాత్ర‌మే తెలుసు. అందుకే ఈయ‌న‌కు ఓట్లు వేసే వారు కూడా బ‌య‌ట పెద్ద‌గా లేరు. ఎప్పుడైనా బ‌య‌ట‌కు వెళ్లిపోయేందుకు మూటా ముళ్లె స‌ర్దుకుని ఈసారు సిద్ధంగా ఉండాల్సిందే.

కానీ.. పాపం ఈయ‌న‌కు ఆవిష‌యం తెలియ‌డం లేదు. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో ప్ర‌స్తుతం కౌశ‌ల్‌తో గొడ‌వ ప‌డే వారెవ‌రైనా.. బ‌య‌ట‌కు వెళ్లిపోతార‌నే దానిపై చ‌ర్చ న‌డుస్తోంది. ఈ కార‌ణం చూపించే బాబూ గోగినేని అత‌నిని ఎలిమినేష‌న్ చేస్తున్న‌ట్టు ఓటు కూడా వేశాడు. ఇలాంటి మూఢ న‌మ్మ‌కాల‌ను తాను న‌మ్మ‌బోనంటూ.. చెప్పాడు. అయ్యో.. సారూ ఇది మూఢ‌న‌మ్మ‌కం కాదండీ, బ‌య‌ట కౌశ‌ల్‌కు ఉన్న ఫాలోయింగ్ వ‌ల్లే ఇలా జ‌రుగుతోంది. ఆయ‌న‌పై క‌క్ష సాధింపుల‌కు దిగే వారెవ‌రినైనా ప్రేక్ష‌కులు ఉతికి ఆరేస్తూ.. బిగ్‌బాస్‌లో నుంచి బ‌య‌ట‌కు లాగేస్తున్నారు. అంతే త‌ప్ప‌.. మీరనుకుంటున్న‌ట్టు ఇదేదో మూఢ‌న‌మ్మ‌కం కాద‌ని.. చెప్పాల‌నిపిస్తోంది. కానీ.. ఆయ‌న ప్ర‌స్తుతం స‌మాజానికి దూరంగా బ‌తుకున్నాడు క‌దా.. అందుకే.. ఏదో భ్ర‌మ‌ల్లో.. విహ‌రిస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -