Wednesday, May 15, 2024
- Advertisement -

ప్ర‌తివారం ఎందుకు ఇలానే జ‌రుగుతుంది?

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ 12 వారంలోకి అడుగు పెట్టింది.బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌పై మొద‌టిలో కొంత వ్య‌తిరేక‌త వచ్చిన‌ప్ప‌టికి వాటిని అధిక‌మించి షోని ముందుకు న‌డిపించ‌డంలో స‌క్సెస్ అయ్యారు బిగ్‌బాస్ టీం.ఇక సోమ‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌లో ఈ వారం ఎలిమినేష‌న్‌కు నామినేష‌న్స్ జ‌రిగియి.హౌస్‌మెట్స్‌లో ఓ న‌లుగురిని డార్క్ రూంకి పిలిచి,వారిలో ఒక‌రిని సేవ్ చేసి మిగిలిన ఇద్దరిని ఎలిమినేష‌న్‌కు నామినేట్ చేయ‌మ‌ని,ఎందుకు నామినేట్ చేస్తున్నారో కార‌ణం చెప్ప‌మ‌న్నాడు బిగ్‌బాస్‌.ఎప్ప‌టిలాగే హౌస్‌మెట్స్ అంద‌రు కౌశ‌ల్ పేరును ప్ర‌తిపాదించారు.గీతా మాధురి,త‌నీష్,గ‌ణేష్,సామ్రాట్‌లు కౌశ‌ల్ పేరును ఎలిమినేష‌న్‌కు నామినేట్ చేశారు.

కౌశ‌ల్‌తో పాటు గ‌ణేష్,అమీత్‌,సామ్రాట్‌లు ఈ వారం ఎలిమినేట్‌కు నామినేట్ అయ్యారు.ఎలిమినేష‌న్‌కు నామినేట్ ప్ర‌క్రియ పూర్తి అవ్వ‌గానే హౌస్‌మెట్స్‌కు టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్.హౌస్‌మెట్స్‌కు ఓ కారు ఇచ్చి దానిని రివ‌ర్స్‌లో న‌డిపి స‌రైన స్థానంలో ఎవ‌రు నిలుపుతారో వారే విజేత అని అవుతార‌నే తెలిపారు.దీంతో హౌస్‌మెట్స్ రెండు టీంలుగా విడిపోయి ఈ గేమ్ ఆడారు.టీం ఏ లో గీతా మాధురి,త‌నీష్‌,అమీత్‌,గ‌ణేష్‌లు ఉన్నారు.అదేవిధాంగా టీం బి లో కౌశ‌ల్‌,సామ్రాట్‌,శ్యామ‌ల‌,రోల్ రైడాలు ఉన్నారు. టీం ఏ లో అమీత్ కారు న‌డ‌ప‌గా,టీం బి లో కౌశ‌ల్ కారు న‌డిపాడు.ఈ గేమ్‌లో టాస్క్‌లో టీం ఏ విజ‌యం సాధించింది.టీం ఏను విజేత‌గా ప్ర‌క‌టించాడ‌న్ని త‌ప్పుప‌ట్టారు టీం బి స‌భ్యులు.ఇక వీరి రెండు గ్రూపుల మ‌ధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుచేసుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -