Sunday, May 5, 2024
- Advertisement -

బిగ్‌బాస్ నూత‌న్ నాయుడు రీ-ఎంట్రీపై హౌస్‌మెట్స్ అస‌హ‌నం

- Advertisement -

బిగ్‌బాస్ -2 నిన్న‌(శుక్ర‌వారం) జ‌రిగిన ఎపిసోడ్‌లో ప‌లు ఆసక్తిక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.శుక్రవారం జ‌రిగిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ న‌డించింది.ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో కౌశల్, దీప్తిలు పోటీ పడగా.. హౌస్‌మెట్స్‌ సపోర్ట్‌తో దీప్తి కెప్టెన్‌గా నిలిచింది.ఇక శుక్ర‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌లో మ‌రోసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు నూతన్ నాయుడు.నూత‌న్ నాయుడు ఎంట్రీ ఇవ్వడం హౌస్‌మెట్స్ షాక్ గురైయ్యారు.గతవారం టాస్క్‌లో కౌశల్‌కి సపోర్ట్ చేస్తూ షోల్డర్ డిస్లోకేట్ కావడంతో హౌస్ నుండి నూతన్ బయటకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.సర్‌ప్రైజ్‌గా ఈరోజు మళ్లీ హౌస్ లోకి ప్రవేశించాడు. అతడి తిరిగి హౌస్ లోకి రావడం పట్ల హౌస్‌మెట్స్ అసహనం వ్యక్తం చేశారు.

బయటకి వెళ్లిన అతడిని మరోసారి ఎలా తీసుకొస్తారంటూ తనీష్ మిగిలిన హౌస్‌మెట్స్ తో చర్చించాడు. అదే సమయంలో నూతన్ కూడా రావడంతో నేరుగా అతడితోనే ఈ విషయంపై చర్చించాడు.రోల్ కూడా తనీష్ మాటలతో ఏకీభవించాడు. గ‌త‌వారం ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకున్నార‌ని త‌నీష్ నూత‌న్ నాయుడిని ప్ర‌శ్నించాడు.ఒక‌వేళ నూత‌న నాయుడు ఎలిమినేషన్‌లో ఉండి ఉంటే దీప్తి సునైనా షోలో ఉండేదిగా అనే విధాంగా త‌నీష్ మాట్లాడాడు.మరి నూతన్ రాక ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -