Tuesday, May 14, 2024
- Advertisement -

ఈ వారం ఎలిమినేష‌న్ అయ్యేది ఆమెనా?

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది.ర‌స‌వ‌త్త‌ర‌మైన టాస్క్‌ల‌తో షోకి మంచి రేటింగ్స్ తీసుకువ‌స్తున్నారు బిగ్‌బాస్ టీం.ఇక ఈ వారం కాల్ సెంట‌ర్ టాస్క్ అంద‌రికి బాగా న‌చ్చింది.కాల్ సెంట‌ర్ టాస్క్ బాగా ఆడిన రోల్ రైడా,కౌశ‌ల్ కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ ప‌డ‌నున్నారు.ఇక వీకెండ్ రావ‌డంతో అంద‌రి క‌ళ్లు ఎలిమినేష‌న్‌పై ప‌డ్డాయి. ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అంద‌రిలోను నెల‌కొంది.

ఈ వారం ఎలిమినేష‌న్‌లో గీతా మాధురి,రోల్ రైడా,పూజా రామాచంద్ర‌న్,దీప్తి సునైనా,శ్యామ‌ల‌,నూత‌న నాయుడులు ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయ్యారు. ఇక ఎప్ప‌టిలాగే ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది లీక్స్ ద్వారా ముందే తెలిసిపోయింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించిన పబ్లిక్ పోల్‌లో దాదాపు ముక్తకంఠంతో ఒక్క పేరే చెబుతున్నారు ప్రేక్షకులు. ఆ పేరు ఎవరిదో మీరు ఇప్పటికే ఊహించి ఉంటారు. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు దీప్తి సునయన.ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రో అండ‌తో ఎలిమినేట్ కాకుండా వ‌స్తున్న దీప్తి ఈ వారం త‌ప్పకుండ బ‌య‌టికి వ‌చ్చేస్తుంది అని అంద‌రు న‌మ్ముతున్నారు.

కాల్ సెంట‌ర్ టాస్క్‌లో ఆమె కౌశ‌ల్‌తో ప్ర‌వ‌ర్తించిన తీరు కౌశ‌ల్ ఆర్మీతో పాటు సామ‌న్య ప్ర‌జ‌ల‌కు కూడా చిరాకు తెప్పించింది.దీంతో ఆమెకు ఎవ‌రు ఓట్లు వేయ‌లేద‌ని తెలుస్తుంది. ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు ఆమెకు వ్యతిరేకంగా ఉండటంతో దీప్తియే బిగ్‌బాస్ హౌస్ నుండి బ‌య‌టికి వ‌స్తుంద‌ని చాలా మంది న‌మ్ముతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -