Monday, April 29, 2024
- Advertisement -

ఈ వారం ఎలిమినేష‌న్ లేద‌ని షాక్ ఇచ్చిన నాని

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ రోజు ,రోజుకి మ‌రింత ఆస‌క్త‌రంగా మారుతుంది.షో ముగియటానికి మ‌రో మూడు వారాలు మాత్ర‌మే ఉండ‌టంతో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విన్న‌ర్‌గా ఎవ‌రు నిలుస్తారో అని అంద‌రిలోను ఆస‌క్తిరేపుతుంది.ఇప్ప‌టికి వ‌రుకు హౌస్‌లోని కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుండడం చూశాం.కాని షో చివ‌రి ద‌శ‌కు చేరండంతో ఇద్ద‌రు ఎలిమినేష‌న్ అవుతార‌ని గ‌త కొంతకాలంగా వార్త‌లు వినిపిస్తున్న ఆ విధాంగా జ‌ర‌గలేదు.అయితే తాజాగా ఈ రోజు (శ‌నివారం) ప్రోమోని విడుద‌ల చేశారు బిగ్‌బాస్ టీం.ఈ ప్రోమోలో అంద‌రికి షాక్ ఇచ్చాడు నాని.

ఈ వారం ఎలిమినేష‌న్ లేదంటు ….ఒక సెక‌న్ ఆగి ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో డ‌బుల్ ఎలిమినేష‌న్ అంటు హౌస్‌మెట్స్‌తో పాటు, షో చూస్తున్న వారికి కూడా షాక్ ఇచ్చాడు నాని.ఇక ఈ వారం అమీత్‌,గ‌ణేష్‌,సామ్రాట్‌,కౌశ‌ల్‌,నూత‌న నాయుడులు ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయ్యారు.ప్రతివారంలానే ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంలో ఆడియన్స్ లో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది.వీరిలో హౌస్‌ను వ‌దిలి ఈ వారం బ‌య‌టికి వ‌చ్చే వారి పేర్లులో గ‌ణేష్ పేరు బాగా వినిపిస్తుంది.ఇక ఈ వారం డబుల్ ఎలిమినేష‌న్ అని నాని హింట్ ఇవ్వ‌డంతో అమీత్ కూడా ఎలిమినేట్ అవుతాడ‌ని అంద‌రు భావిస్తున్నారు.మ‌రి ఆదివారం జ‌రిగే ఎపిసోడ్‌లో ఎవ‌రు బిగ్‌బాస్ హౌస్‌ను వ‌దిలి బ‌య‌టికి వ‌స్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -