Thursday, May 16, 2024
- Advertisement -

కౌశ‌ల్ ఆర్మీ ముందు బాబు గోగినేని నిల‌బ‌డ‌గ‌ల‌డా?

- Advertisement -

బిగ్‌బాస్ హోస్‌లోకి ఎటువంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన వ్య‌క్తి కౌశ‌ల్‌.మ‌హా అయితే ఒక వారం,లేక‌పోతే రెండో వారం ఎలిమినేట్ అవుతాడ‌ని భావించిన కౌశ‌ల్‌…ఇప్పుడు ఏకంగా బిగ్‌బాస్‌నే రూల్ చేస్తున్నాడు అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.మొద‌టివారం కౌశ‌ల్‌ను చూసిన జ‌నాలు అత‌నిని బాగానే వ్య‌తిరేకించిన‌ప్ప‌టికి పోను పోను త‌న ప్ర‌వ‌ర్త‌న చూసి ప్ర‌జ‌లు అత‌నికి అల‌వాటు పడ్డారు.

కౌశ‌ల్ బిహేవియ‌ర్ చూసిన ప్ర‌జ‌లు…. మ‌న బిహేవియ‌ర్ కూడా ఇలానే ఉంటుంది క‌దా అనుకోవ‌డం మొద‌లు పెట్టారు.కౌశ‌ల్‌ను ఎక్కువ ఇష్టప‌డ‌టానికి కార‌ణం కూడా ఇదే. దీంతో కౌశ‌ల్‌కు  ఓ స్టార్ హీరోతో స‌మానంగా ఫాలోయింగ్ వ‌చ్చేసింది.ఇక కౌశ‌ల్ పేరిట ఓ అభిమాన సంఘం ఒక‌టి పుట్టుకొచ్చింది.కౌశ‌ల్ ఆర్మీ పేరిట వారు కౌశల్‌కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. ఇక కౌశ‌ల్‌తో పెట్టుకున్న వారిందరు షో నుండి ఎలిమినేట్ అవుతున్నార‌నే టాక్ విన‌బ‌డుతుంది.ఇది నిజంగానే జ‌రుగుతుంది కూడా.భాను శ్రీ,తేజ‌స్వీ వీరిద్ద‌రు కౌశ‌ల్‌ను వ్య‌తిరేకించిన వారే,దీని కార‌ణంగానే వారిని బ‌య‌టికి పంపించేశార‌ని చ‌ర్చించుకుంటున్నారు.వీరికి వ్య‌తిరేకంగా కౌశ‌ల్ ఆర్మీ ప‌నిచేసింద‌ని అంద‌రికి తెలిసిందే.

ఈ కార‌ణంగానే షోలో ఎంతో స్ట్రాంగ్ కంటెస్ట్ అయిన తేజ‌స్వీ కూడా ఎలిమినేట్ అయింద‌ని తెలిసిన విష‌య‌మే.తాజాగా బాబు గోగినేని కౌశ‌ల్‌పై చేసిన కామెంట్స్ సంచ‌ల‌నంగా మారాయి.నేను క‌నుక ఎలిమినేట్ అయితే బ‌య‌టికి వెళ్లి కౌశల్‌,గీతా మాధురి బ‌య‌టికి వెళ్లేలా ప్లాన్ చేస్తాన‌ని అన‌డం చ‌ర్చ‌నీయంశంగా మారింది.లోప‌ల ఉన్న బాబుకి తెలియ‌దు క‌దా బ‌య‌ట ఉన్న కౌశ‌ల్ అభిమానుల బ‌లం గురించి,అందుకే బాబు అలా అంటున్నారు.బిగ్‌బాస్ నుండి ఎలిమినేట్ అయిన వారు కౌశ‌ల్‌కు ఉన్న మ‌ద్ద‌తు చూసి షాక్ అవుతున్నారు.కౌశ‌ల్ ఆర్మీ ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టింస్తుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -