Thursday, May 16, 2024
- Advertisement -

‘కౌశ‌ల్ ఆర్మీ’ వ‌ల్లే నేను బ‌య‌టికి వ‌చ్చాను

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో ఈ వారం మ‌రో ఎలిమినేష‌న్ జ‌రిగిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఈ వారం ఎలిమినేట్ అయింది హీరోయిన్ నందిని.బ‌య‌టికి వ‌చ్చిన నందిని ఓ టీవి చ‌ర్చ‌లో మాట్లాడుతు నేను కౌశ‌ల్ వ‌ల్లే బ‌య‌టికి వ‌చ్చాన‌ని కామెంట్స్ చేసింది.బ‌య‌ట ఉన్న కౌశ‌ల్ ఆర్మీ న‌న్ను బాగా టార్గెట్ చేశార‌ని,వారంద‌రు నాకు వ్య‌తిరేకంగా ఓట్లు వేశార‌ని తెలిపింది నందిని.కాని షోలో జ‌రుగుతుంది ఒక‌టి,బ‌య‌ట చూపిస్తుంది మ‌రోక‌ట‌ని నందిని చెప్పుకొచ్చింది. కౌశల్ నాకు మంచి సపోర్ట్ ఇస్తాను. నన్ను నామినేషన్స్ నుండి ఒకసారి సేవ్ చేశాడు.

ఇద్దరం తిట్టుకుంటాం, మళ్లీ కలిసిపోతాం. టాస్క్ లో అయితే నేను తన మీద అలిగానని వచ్చి మాట్లాడి నాకు ఫుడ్ కూడా తినిపించాడు. అవేవీ టీవీలో చూపించట్లేదు. మేమిద్దరం కొట్టుకున్నదే చూపించారు. దీంతో అందరికీ మా ఇద్దరికీ పడదని తప్పుగా అర్ధమైంది.దీంతో కౌశ‌ల్ ఆర్మీ నన్ను టార్గెట్ చేశారు.బ‌య‌టికి వ‌చ్చినందుకు చాలా బాధాగా ఉంద‌ని,షోలో జ‌రిగేది అంతా చూపిస్తే బాగుంటుంద‌ని నందిని తెలిపింది నందిని.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -