Thursday, April 25, 2024
- Advertisement -

బిగ్ బాస్: మోనల్ కు బంపర్ ఆఫర్.. బుల్లితెరపై సందడే సందడి

- Advertisement -

సుడిగాడు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది గుజరాతీ భామ మోనాల్‌ గజ్జర్‌. ఆ తర్వాత ఒక కాలేజ్‌ స్టోరీ, బ్రదరాఫ్‌ బొమ్మాలి వంటి చిత్రాలతో పాటు పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో తళుక్కుమంది. అయితే హీరోయిన్‌గా నటించినప్పటికీ ఈ అమ్మడికి ఆశించినంత గుర్తింపు రాలేదు గానీ తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4తో మాత్రం కావాల్సినంత ప్రాచుర్యం దక్కింది. విజేతగా నిలిచిన అభిజిత్‌తో తొలుత సన్నిహితంగా మెలిగిన మోనాల్‌.. ఆ తర్వాత అఖిల్‌(రన్నరప్‌)తో క్లోజ్‌గా ఉంటూ స్క్రీన్‌ స్పేస్‌ కొట్టేసింది. ఆమె కోసం వీరిద్దరు గొడవపడటంతో కొన్నాళ్లపాటు ఈ ట్రయాంగిల్‌ స్టోరీ హాట్‌ టాపిక్‌గా మారింది. నిజానికి షో చప్పగా సాగుతున్న సమయంలో అభి- మోనాల్‌- అఖిల్‌ ఎపిసోడ్‌ బూస్ట్‌నిచ్చింది. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురికి సంబంధించినవే ప్రసారం కావడం విశేషం. ముఖ్యంగా హౌజ్‌లో అఖిల్- మోనాల్‌ల కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. అంతేగాక తన అందచందాలతో కూడా ఈ ముద్దుగుమ్మ యూత్‌ను అట్రాక్ట్‌ చేసి క్రేజ్‌ సంపాదించింది.

ఇక హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక.. ఈ అందాల నటికి వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సినిమాల‌తో పాటు ప‌లు షోల‌లో ఆమె పాల్గొననున్నట్లు స‌మాచారం. ముఖ్యంగా బిగ్‌బాస్‌ షో ప్రసారమైన స్టార్ మాలో ఆదివారం నుంచి ప్రసారం కాబోయే డ్యాన్స్ ప్ల‌స్ షోలో మోనాల్ భాగం కానున్నట్లు ఇటీవల టాక్‌ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దానిని ఖరారు చేస్తూ శనివారం ఓ ప్రోమో విడులైంది. అందులో వ‌న్ డే టు గో అంటూ త‌న‌దైన స్టైల్‌లో స్టిల్‌ ఇచ్చింది మోనాల్. అయితే ఈ షోలో ఆమె మెంటార్‌గా ఉండ‌నున్నారా..? లేదా జ‌డ్జిగా ఉండ‌బోతున్నారా అన్న విషయంలో స్పష్టత లేదు. కాగా ఈ షోకి బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్, య‌శ్ మాస్ట‌ర్, ర‌ఘు మాస్ట‌ర్ కూడా జడ్జీలుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -