Monday, April 29, 2024
- Advertisement -

హౌస్‌మెట్స్ టాలెంట్‌ బ‌య‌ట‌పెట్టే ప‌నిలో ప‌డ్డ బిగ్‌బాస్‌

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే.మ‌రో రెండు వారల‌లో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ముగియ‌నుంది.రెండో సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రు అవుతారా అనే ఆస‌క్తి అంద‌రిలోను నెల‌కొంది.ఇక బిగ్‌బాస్‌లో మ‌రికొద్ది రోజుల్లో ముగియ‌నుండటంతో జ‌నాల‌కు ఆక‌ట్టుకునే ప‌నిలో ఉన్నారు హౌస్‌మెట్స్‌.ప్ర‌స్తుతం హౌస్‌లో ల‌గ్జ‌రీ బడ్జెట్ టాస్క్ న‌డుస్తుంది.ఈ టాస్క్‌లో హౌస్‌మెట్స్ అంద‌రు హూషారుగా పాల్గొన్నారు.తాజాగా ఈ రోజు(బుధ‌వారం) ప్రోమోని విడుద‌ల చేశారు బిగ్‌బాస్ టీం.బిగ్‌బాస్ త‌న బ‌ర్త్ డే పేర‌ట హౌస్‌మెట్స్‌కు ఫిక్ష‌న‌రి టాస్క్ ఇచ్చాడు.

ఈ టాస్క్‌లో హౌస్‌మెట్స్ ప్ర‌తి ఒక్కొక్క‌రికి ఒక కార్డు ఇచ్చి ఆ కార్డులో ఉన్న బొమ్మ‌ని మార్క‌ర్‌తో వైట్ బోర్డు మీద గీయ‌వ‌ల్సి ఉంటుంది.వారు గీసే బొమ్మ ఏంటో మిగిలిన హౌస్‌మెట్స్ చెప్పాలి. ఈ టాస్క్‌లో ఇంటి స‌భ్యులు అంద‌రు చాలా హూషారుగా పాల్గొన్నారని ఈ ప్రోమోని చూస్తే అర్థం అవుతుంది.నిన్న(మంగ‌ళ‌వారం) జ‌రిగిన ఎపిసోడ్‌లో డ్యాన్స్‌ల‌తో అల‌రించిన బిగ్‌బాస్ ఇంటి స‌భ్యులు ఈ రోజు(బుధ‌వారం) ఉత్స‌హాంగా బిగ్‌బాస్ ఫిక్ష‌న‌రి టాస్క్‌ను కూడా చాలా ఎంజాయ్ చేసినట్లుగా ఈ రోజు ప్రోమోని చూస్తే అనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -