Sunday, May 5, 2024
- Advertisement -

ఈ వారం నామినేష‌న్ మరింత ఆసక్తిక‌రంగా…

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ 11 వారాలు పూర్తి చేసుకుని 12 వారంలోకి అడుగుపెట్టింది.ఆదివారం జ‌రిగిన ఎలిమినేష‌న్‌లో వైల్డ్‌కార్డు ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ పూజా రామచంద్ర‌న్ బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే.ఇక సోమ‌వారం జ‌రిగే ఎపిసోడ్‌లో నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు బిగ్‌బాస్.ఓ డార్క్ రూంకి హౌస్‌మెట్స్‌ని పిలిచి అక్కడ ఒక్కో కంటెస్టెంట్ ని ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో.. కారణాలు చెప్పి చేయమని సూచించారు బిగ్ బాస్.సాధార‌ణంగానే అంద‌రు కౌశ‌ల్ పేరు చెప్పారు.కౌశ‌ల్‌తో పాటు నూతన్, గణేష్ పేర్లు కూడా చెప్పారు.కౌశ‌ల్ గణేష్‌ను నామినేట్ చేశాడు.అక్క‌డితో ఆగ‌కుండా గణేష్ పేరు చెప్పి తన ముందు కొన్ని వ్యాఖ్యలు చేశారు.

గ‌ణేష్ నువ్వు కామ‌న్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చావు కదా…కాని ఇక్క‌డ సోమరిపోతులకు ఈ బిగ్ బాస్ హౌస్ లో ఆస్కారం లేదని చెప్పాడు కౌశ‌ల్‌.దీంతో గ‌ణేష్ నువ్వు ఏం బిగ్‌బాస్‌వి కాదు అంటు కౌశ‌ల్‌పై రెచ్చిపోయ్యాడు.తాజాగా ఈ రోజు జ‌రిగే ఎపిసోడ్ ప్రోమోని విడుద‌ల చేశారు బిగ్‌బాస్ టీం.ఇక ఈ వారం ఎలిమినేష‌న్‌లో కౌశ‌ల్‌తో పాటు,నూత‌న్ నాయుడు,గ‌ణేష్‌లు ఉండేలా ఉన్నార‌ని ప్రోమోని చూస్తే అర్థం అవుతుంది. ఈ రోజు ఎపిసోడ్‌లో నామినేషన్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా ఉంటుంది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.మ‌రి అ వారం ఎవ‌రు బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవ‌రు నామినేట్ అవుతారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -