Monday, April 29, 2024
- Advertisement -

బిగ్ బాస్ వల్ల వరుణ్ కి అదృష్టం.. ఏమైందంటే ?

- Advertisement -

బిగ్ బాస్ కి అన్ని భాషాల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ షోలో పాల్గొనేందుకు సెలబ్రిటీలు ఎక్కువ ఆసక్తి చూపిస్తూంటారు. అయితే బిగ్ బాస్ వల్ల చాలా మంది కెరీర్ లు టర్న్ అయ్యాయి. బాలీవుడ్ లో బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచుకున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ బిగ్ బాస్ ద్వారా వస్తే మంచి పేరు వస్తుంది. లేకుంటే చెడ్డ పేరు వచ్చి నష్టపోయిన వారు కూడా ఉన్నారు.

అయితే తెలుగులో బిగ్ బాస్ రెండో సీజన్ ద్వారా చాలా మందికి మంచి పేరు వచ్చింది. సినిమాల్లో కూడా మంచి మంచి అవకాశాలు సంపాధించుకుని సక్సెస్ అయ్యారు. తాజాగా బిగ్ బాస్ మూడో సీజన్ ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో రాహుల్ విన్నర్ కాగా.. శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. అయితే టాప్ ఫైవ్ లో వరుణ్ సందేశ్ నిలిచాడు. అయితే బిగ్ బాస్ వల్ల వరుణ్ కి మంచి పేరు వచ్చింది.

ప్రధానంగా ఫ్యామిలీస్ ఎక్కువగా వరుణ్ కి కనెక్ట్ అయ్యారు. అయితే ఈ బిగ్ బాస్ వల్ల వరుణ్ కి మంచి క్రేజ్ పేరగడం తో అతనికి వరస ఆఫర్స్ వస్తున్నాయి. 2015లో లవకుశ చిత్రం తర్వాత వరుణ్ సినిమాల్లో కనిపించలేదు. దాదాపు కెరీర్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్లీ ఇప్పుడు అంటే నాలుగు సంవత్సరాల తర్వాత వరుణ్‌ సందేశ్‌కు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి.

ప్రస్తుతంకు రెండు సినిమాల్లో ఆఫర్ వచ్చిందని సమాచారం. అందులో ఒకటి మల్టీస్టార్, మరొకటి సోలో హీరోగా చేయబోతున్నాడని తెలుస్తోంది. సోలో హీరోగా చేయబోయే సినిమా వరంగల్‌ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. వరుణ్ కి మంచి ఆఫర్స్ రావడంతో అతని భార్య వితిక కూడా హ్యాపీగా ఉందట. మరి ఈ రెండు సినిమాలతో వరుణ్ బిజీ అవుతాడేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -