Thursday, May 2, 2024
- Advertisement -

హైపర్ ఆదికి షాక్.. జబర్దస్త్ నుంచి వెళ్లకపోవడానికి కారణం ఇదే..!

- Advertisement -

చాలా ఏళ్ళుగా జబర్దస్త్ కామెడీ షో రన్ అవుతున్న విషయం తెలిసిందే. అద్భుతమైన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తారు ఇందులోని కమెడియన్స్. అయితే ఈ షో ద్వారా చాలా మంది ఆర్టిస్టులు పాపులర్ అయ్యారు. కొందరు కమెడియన్ గా డబ్బులు సంపాధిస్తున్నారు. మరి కొందరు హీరోలుగా ఎదిగారు.

జబర్దస్త్ ద్వారా కెరీర్ పరంగా నిలదొక్కుకున్నారు. ఇక ఇంతకాలం పాటు ఈ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ వచ్చిన నాగబాబుతో సహ.. కొంతమంది ఆర్టిస్టులు జబర్దస్త్ నుంచి మరో ఛానల్ లోని షోకి వెళ్లిపోయారు. అయితే జబర్దస్త్ లో హైపర్ ఆది కి అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. అతని కోసమే జబర్దస్త్ చూసేవాళ్లు ఉన్నారు. యూట్యూబ్ లో కూడా అతని వీడియోస్ కి కోట్లలో వ్యూస్ ఉన్నాయి. అలాంటి ఆది జబర్దస్త్ లో ఉంటాడా ? లేకుంటే నాగబాబులాగే జంప్ అవుతారా ? అనే సందేహం అందరిలో కలిగింది.

అయితే హైపర్ ఆది జబర్దస్త్ లోనే ఉంటున్నాడనే విషయంను.. వచ్చేవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో స్పష్టం చేసింది. ’జబర్దస్త్’ దర్శకులతోను.. నాగబాబుతోను హైపర్ ఆదికి మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే.. ’మల్లెమాల’ వారితో అగ్రిమెంట్ ఉన్న కారణంగానే.. హైపర్ ఆది బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -