Tuesday, May 14, 2024
- Advertisement -

బిగ్‌బాస్: కౌశ‌ల్‌పై మ‌రోసారి త‌న అక్క‌సుని చూపించిన త‌నీష్‌

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ చివ‌ర ద‌శ‌కు చేరుకుంది.మ‌రో రెండు వారాల‌లో ముగియ‌నున్న బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రు అవుతారా అని అంద‌రు అతృత‌గా ఎదురు చూస్తున్నారు.తాజాగా జ‌రిగిన ఎలిమినేష‌న్‌లో కామ‌న్‌మ్యాన్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నూత‌న్ నాయుడు,గ‌ణేష్‌లు ఎలిమినేష‌న్ అయిన సంగ‌తి తెలిసిందే.తాజాగా సోమ‌వారం జ‌రిగే ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు బిగ్‌బాస్ టీం.ల‌వ్య్వూ హెట్య్వూ టాస్క్‌లో ఇచ్చాడు బిగ్‌బాస్‌.ఈ టాస్క్‌లో హౌస్‌మెట్స్ ఎవ‌రంటే ఇష్ట‌మో,ఎవ‌రు ఇష్టం లేదో చెప్పాలి.

మొద‌ట శ్యామ‌ల గీతాకి లవ్య్వూ చెప్ప‌గా,త‌నీష్‌కు హెట్య్వూ చెప్పింది.త‌నీష్ సామ్రాట్‌కు ల‌వ్య్వూ చెప్పాగా కౌశ‌ల్‌కు హెట్య్వూ చెప్పి మ‌రోసారి కౌశ‌ల్‌పై ఉన్న అక్క‌సుని బ‌య‌టపెట్టుకున్నాడు.గీతా అంద‌రికి భిన్నంగా సామ్రాట్‌కు హెట్య్వూ చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది.అమీత్ రోల్ రైడాకు ల‌వ్య్వూ చెప్పి మ‌రోసారి త‌న అభిమానాన్ని చాటుకున్నాడు అమీత్‌.ఇక కౌశల్ ఎవ‌రికి ఏం చెప్పాడో అన్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు.మ‌రి ఈ లవ్య్వూ,హెట్య్వూ టాస్క్ బిగ్‌బాస్ హౌస్‌లో ఎన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -