బిగ్‌బాస్ రెండో సీజన్ తుది అంఖానికి చేరుకుంది.నిన్నటి(సోమవారం) జరగిన ఎపిసోడ్‌తో బిగ్‌బాస్ రెండో సీజన్ 100 రోజులు పూర్తి చేసుకుంది.ఇక 100వ ఎపిసోడ్‌లో కూడా హౌస్‌మెట్స్ మధ్య గొడవలు జరిగాయి.గత రెండు వారాలు జరిగిన దాని మీద చర్చించుకుంటు ఇంటి సభ్యులు గొడవకు దిగారు.ఎప్పటిలాగే ఇంటి సభ్యులందరు కౌశల్ టార్గెట్ చేసుకుని గొడవకు దిగారు.మొదట తనీష్.. ప్రాసెస్ ఆఫ్ విన్నింగ్‌ను మీరెలా చూస్తారని కౌశల్‌ని అడగడంతో నేను గేమ్ పట్ల ఇంతలా ఫోకస్ చేయడానికి నేను పెరిగిన విధానం అటువంటిది అందుకే నేను గేమ్ ఇలా ఆడుతున్నానని బదులిచ్చాడు కైశల్.అలాగే మళ్లీ బయటకు వెళితే వేరే కౌశల్‌ని చూస్తారు. పోటీలో ఉన్నప్పుడే ఇలాంటి కౌశల్‌ను చూస్తారు. ఇక బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చాకా హౌస్‌మెట్స్‌తో బంధాలు పెట్టుకోవడం వల్ల గేమ్‌ని గేమ్‌లా ఆడలేం అని,నేను గేమ్‌ని గేమ్‌లాగే ఆడతానని ,ఇక్కడికి వచ్చింది రిలేషన్‌షిప్ పెంచుకోవడానికి కాదని తనీష్‌కు సమాధానం ఇచ్చాడు కౌశల్.
దీనికి కౌంటర్‌గా తనీష్.. మీరు బంధం గురించి మాట్లాడారుగా.. అసలు మీకు బంధాల పట్ల రెస్పెక్ట్ ఉందా? అని అడిగారు. నాకు వందశాతం ఉందనడంతో మరెందుకు హౌస్‌లో ఉన్నవాళ్ల బంధాల్ని రెస్పెక్ట్ చేయరన్నారు. అలాచేస్తే ఆ బంధం చాలా విషయాల్లో గేమ్ సరిగా ఆడకుండా ఆపేస్తుందన్నారు. ఇక వీరి మధ్య చర్చ సీరియస్‌గా మారింది.తరువాత ఇది వ్యక్తిగత దూషణలకు వరకు వెళ్లడంతో బిగ్‌బాస్ కలుగజేసుకుని ఇంటి సభ్యులు రూల్స్‌కు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారంటు ఇంటి సభ్యులను హెచ్చిరించారు.
