Wednesday, May 15, 2024
- Advertisement -

శ్యామల కంటే పావలా శ్యామల బెటర్

- Advertisement -

యాంకర్ శ్యామల తిన్నింటి వాసాలు లెక్కపెట్టిందని, కౌషల్ అభిమానులు, బిగ్ బాస్ ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఫస్ట్ టైం ఎలిమినేట్ అయ్యాక, మళ్లీ రీ ఎంట్రీ కోసం కౌషల్ ఆర్మీ కాళ్లా వేళ్లా పడి బతిమాలుకుని, ఇప్పుడు అత్యంత దారుణంగా వెన్నుపోటు పొడుస్తావా ? అని కౌషల్ ఆర్మీ నిప్పులు చెరుగుతోంది. యాంకర్ శ్యామల కంటే పావలా శ్యామలే బెటర్. బిగ్ బాస్ హౌస్ కి ఓ గ్లామర్ తో పాటు నిజాయతీ గల కంటెస్టెంట్ దొరికేది అని అత్యంత వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఇంటర్వ్యూలోనూ, ఫేస్ బుక్ లైవుల్లోనూ శ్యామల కౌషల్ భజన చేసింది. నాకు రీ ఎంట్రీ అవకాశం ఇస్తే హౌస్ లోకి వెళ్లి, దుమ్ము దులిపేస్తాను. తేజశ్వి దొంగ, తేజశ్వి పొగరుబోతు, అంటూ అవసరం ఉన్నా లేకున్నా తేజశ్విని తిట్టేసింది. కౌషల్ ను తెగ పొగిడేసింది. కౌషల్ భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడింది. నందినిని ఎలిమినేట్ చేసినప్పుడు కౌషల్ కూడా శ్యామలను సేవ్ చేసి ఉండి ఉంటే బాగుండేది. అనవసరంగా నిన్ను సేవ్ చేశాను, అని పశ్చాత్తాపడ్డాడు. అని పదే పదే చెప్పుకొచ్చింది. ఇలా ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా, శ్యామల కౌషల్ అభిమానులను ప్రాథేయపడింది.

తీరా కౌషల్ ఆర్మీ దయాదాక్షిణ్యాలతో రీఎంట్రీ ఇచ్చిన శ్యామ‌ల తాజా ఎపిసోడ్‌లో వ్య‌వ‌హ‌రించిన తీరు, బ‌య‌ట విష‌యాల‌ను అత్యంత బ‌హిరంగంగా మిగ‌తా కంటెస్టెంట్‌ల‌ను గ్రూపుగా కూర్చోబెట్టి మ‌రీ చెప్పేసింది. తాను బయట చెప్పినట్టు లోపలకు వెళ్లాక కౌషల్ కు ఏ ఒక్క సందర్భంలోనూ సపోర్ట్ చేయలేదు. పైగా ర్యాపిడ్ పైర్ సందర్భంగా సామ్రాట్ ను సేవ్ చేస్తాను. కౌషల్ ను నామినేట్ చేస్తాను అని నానితో చెప్పింది. తాజాగా చీటికిమాటికి కౌషల్ మీద రెచ్చిపోయే తనీష్ ను సేవ్ చేసింది. పైగా కౌషల్ ను సేవ్ చేసి, మద్దతిస్తున్న నూతన్ నాయుడుని నామినేట్ చేసింది. అతడు బయట కౌషల్ భజన చేశారు. కౌషల్ మీద గుడ్లు కొట్టిన వారి అంతు చూస్తాను. చీల్చి చెండాడుతాను, అని చెప్పాడు. కౌషల్ ఆర్మీకి భయపడి, అతిడికి అన్నింటిలో సపోర్ట్ చేస్తున్నాడు. నాకు అది నచ్చలేదు. అందుకే నూతన్ నాయుడుని నామినేట్ చేశాను అని తనీష్, సామ్రాట్, గీతా మాధురితో చెప్పుకొచ్చింది. తాను నూతన్ ను నామినేట్ చేయడమే కాకుండా, ఇతరులనూ ఇన్లఫుయెన్స్ చేసి వారితోనూ నామినేట్ చేయించింది. తాను కౌషల్ కు మద్దతుగా ఉంటానని చెప్పి చేయలేదు. నూతన్ నాయుడు చెప్పిన మాటకు, స్నేహధర్మానికి కట్టుబడి కౌషల్ కి సపోర్ట్ చేస్తుంటే….అతడిని నామినేటే చేసింది. పైగా తానో పెద్ద డాష్ లాగా, నూతన్ మాత్రమే కౌషల్ ఆర్మీ ఓట్లుతో రీ ఎంట్రీ ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చుకుంది. దీంతో శ్యామల గుంటనక్క కన్నా డేంజర్ అని బిగ్ బాస్ ప్రేక్షకులు మండిపడుతున్నారు. బయటి విషయాలను లోపల చెప్పి బిగ్ బాస్ రూల్సు ఉల్లంఘించినందుకు ఆమెను తక్షణం రెడ్ కార్డ్ ద్వారా ఎలిమినేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -