Monday, May 20, 2024
- Advertisement -

బిగ్‌బాస్ ఫైన‌ల్ చేరుకున్న సామ్రాట్

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మ‌రికొద్ది రోజుల్లో ముగియ‌నుంది.ఫైన‌ల్ చేర‌డానికి ఇంటి స‌భ్యులంద‌రు తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నారు.సోమ‌వారం నుంచి జ‌రుగుతున్న గొడ‌వ‌లు గురువారం కాస్తా చ‌ల్లబ‌డిన‌ట్లు కనిపించింది.బిగ్‌బాస్ ఫినాలే రేస్ టుకి చేరుకునేందుకు సామ్రాట్‌, రోల్ రైడాల‌కి మీ గుడ్డు జాగ్ర‌త్త అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. బౌల్‌లో ఉన్న కోడిగుడ్ల‌ని గేమ్‌లో పాల్గొన్న‌ ఇద్ద‌రు స‌భ్యులు ప‌గ‌ల‌గొట్ట‌కుండా చూసుకోవాలి. టాస్క్‌లో భాగంగా మిగ‌తా ఇంటి స‌భ్యులు ఒక‌రికి మ‌ద్ద‌తు తెలుపుతూ మ‌రొక‌రివి ప‌గ‌ల‌గొట్టొచ్చ‌ని అన్నారు. చివరిగా ఎవరి బౌల్‌లో ఎక్కువ గుడ్లు పగలకుండా ఉంటాయో వాళ్లే డైరెక్ట్‌గా ఫినాలేకి వెళ్తారంటూ బిగ్‌బాస్ ఈ టాస్క్ ఇచ్చారు .

టాస్క్‌లో భాగంగా మిగ‌తా ఇంటి స‌భ్యులు ఒక‌రికి మ‌ద్ద‌తు తెలుపుతూ మ‌రొక‌రివి ప‌గ‌ల‌గొట్టొచ్చ‌ని అన్నారు. చివరిగా ఎవరి బౌల్‌లో ఎక్కువ గుడ్లు పగలకుండా ఉంటాయో వాళ్లే డైరెక్ట్‌గా ఫినాలేకి వెళ్తారు.ఈ టాస్క్‌లో కౌశ‌ల్ ఒక్క‌డే రోల్ రైడాకి మ‌ద్ద‌తుగా నిలిచాడు.మిగిలిన ఇంటి స‌భ్యులు అంద‌రు సామ్రాట్‌కు అండ‌గా నిలిచారు.చివరకు రోల్ గుడ్లు పగిలిపోవడంతో.. సామ్రాట్ ఫినాలేకి చేరుకున్నారు. ఈ వారం ఎలిమినేష‌న్‌కు హోస్‌మెట్స్‌ అంద‌రు నామినేట్ అయ్యారు.సామ్రాట్ డైరెక్ట్‌గా ఫైన‌ల్ వెళ్ల‌డంతో అత‌ను ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించ‌కున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -