ఏపీ సీఎం చంద్రబాబుకు దర్మాదాబాద్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు కేసులో అక్టోబర్ 15వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. ఎవరికీ కూడ ప్రత్యేక ట్రీట్‌మెంట్లు లేవని కోర్టు తేల్చి చెప్పింది.
2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టిన ఆందోళనకు సంబంధించి ధర్మాబాద్ కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబుతో సహా 15 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
కోర్టుకు హాజరయ్యేందుకు తనకు సమయంలో లేకపోవడంతో.. నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తరపున ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ శుక్రవారం నాడు ధర్మాబాద్ కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచార ణ జరిపిన దర్మాబాధ్ కోర్టు అక్టోబర్ 15 వతేదీకి కేసును వాయిదా వేసింది.
ఈ కేసులో ఎవరికీ ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. అక్టోబర్ 15వ తేదీన చంద్రబాబునాయుడు సహా కేసులో ఉన్నవారంతా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కోర్టుకు హజరయిన మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
