Wednesday, May 15, 2024
- Advertisement -

బిగ్ బాస్ సభ్యులు బ్యాగులు సర్దారు.. బయటకేనా ?

- Advertisement -

బిగ్ బాస్ తెలుగు షో అయిపోవడానికి దగ్గర పడుతున్న క్రమంలో ఇంటి సభ్యులను బిగ్ బాస్ టెన్షన్ పెడుతున్నాడు. రాహుల్ ఫైనల్ లో ఉండగా.. మిగిలిన ఐదుగురు నామినేషన్ లో ఉన్నారు. అయితే అలీ ఈ వారం ఎలిమినేట్ అవుతాను అని ఫిక్స్ అయిపోయాడు. ఇక శివజ్యోతి కూడా పదే పదే ఎలిమినేషన్ గురించి మాట్లాడుతుంది. అయితే ఇటీవలే జరిగిన ఎపిసిడ్ లో శ్రీముఖీ ’హౌ క్లీన్ ఈజ్ యువర్ జర్నీ’ అనే టాస్క్ లో విన్ కావడంతో ఆడియన్స్ ను ఓట్లు ఆడిగే ఛాన్స్ ను దక్కించుకుంది.

ఈ వారం ఆకారి ఎలిమినేష్ కావడంతో అందరిలో టెన్షన్ ఉంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో హౌస్ మెంట్స్ అందరికీ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. అందరూ నిద్రపోతున్న టైంలో సైరన్ మోగించి వారిని నిద్ర లేపాడు. వెంటనే బ్యాగులను సర్దుకుని గార్డెన్ ఏరియా రావాల్సిందిగా బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. మరి ఇంత సడెన్ గా అందర్ని బ్యాగులు ఎందుకు సర్దుకోమన్నారనే విషయం త్వరలో తెలియనుంది.

అయితే ఈ సారి ఎలిమినేషన్ ప్రక్రియా నాగార్జున లేకుండానే జరగనుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ ఎలిమినేషన్ కంప్లీట్ అవుతే బిగ్ బాస్ షో ఫైనల్ లెవల్ కు చేరుకుంటుంది. ఫైనల్ లో ఇప్పటికే రాహుల్ చేరుకున్నాడు. ఇక రాహుల్ తో పాటు శ్రీముఖి, బాబా మాస్టర్, వరుణ్ లు కూడా వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. అలీ, శివజ్యోతి ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ పక్కా అని తెలుస్తోంది. అందరికంటే తక్కువ ఓట్లు శివజ్యోతి, అలీకే వచ్చాయి కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -