Saturday, May 4, 2024
- Advertisement -

ఏపీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న బిగ్‌బాస్ న‌టి

- Advertisement -

తెలుగు రియాల్టీ షో రెండో సీజ‌న్‌లో ఎంట్రీ ఇచ్చింది సంజ‌న. అంత‌క‌ముందు మిస్ హైదరాబాద్ టైటిల్ విన్నర్ అయిన సంజన.. అడపాదడపా కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది. కాని బిగ్‌బాస్ ద్వారా బాగానే ఫేమ‌స్ అయింది. కాక‌పోతే ఈ షో నుంచి మొద‌టి వారంలోనే బ‌య‌టికి వ‌చ్చేసింది. బిగ్‌బాస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన త‌రువాత సినిమాల్లో న‌టిద్దామ‌ని ఆశించిన‌ప్ప‌టికి పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఇప్పుడు మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది ఈ భామ‌. సంజ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో పోటీ చేస్తుంది. అవును మీరు చ‌దువున్న‌ది నిజ‌మే సంజ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంది.

నూజివీడు అసెంబ్లీ బరి నుంచి ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన సాయిసంజన అసలు పేరు అన్నే వనజ. ఆమె తండ్రి అన్నే ధనకోటేశ్వరరావు రైతు. 2016లో సంజ‌న మిస్‌ హైదరాబాద్‌గా ఎంపికయ్యారు. మొద‌ట కాంగ్రెస్ పార్టీ త‌రుపున టికెట్ కోసం ఆశించి భంగ‌ప‌డింది. టికెట్ రాక‌పోవ‌డంతో స్వతంత్ర అభ్యర్థిగా నూజివీడు అసెంబ్లీ బరిలో పోటీచేస్తున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్సీ, మంత్రి పాలడుగు వెంకట్రావుకు సంజ‌న ద‌గ్గ‌ర బంధువు అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -