Wednesday, May 8, 2024
- Advertisement -

అవ‌స‌రం అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెల్తాం…టీడీపీ

- Advertisement -

ఏపీలో అధికారుల బ‌దిలీ వివాదానికి ఇప్పుడే తెర‌ప‌డేట్లు క‌నిపించడంలేదు. బాబు ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఐబీ ఛీఫ్ తో స‌హా కొంద‌రు అధికార‌లు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైసీపీ సీఈసీకి ఫిర్యాదు చేయ‌డంతో ఎన్నిక‌ల సంఘం ఐబీ ఛీఫ్ వెంటేశ్వ‌ర‌రావు, శ్రీకాకుళం ఎస్పీ, క‌డ‌ప ఎస్పీ ల‌ను ఎన్నిక‌ల విధుల‌నుంచి త‌ప్పించ‌డంతో ప్ర‌భుత్వం ఈసీపై హైకోర్టుకు వెల్లింది.

అక్క‌డ‌కూడా చుక్కెద‌ర‌వ‌డంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెల్లేందుకు సిద్ద‌మ‌వుతున్నామ‌ని టీడీపీ నేత రాజేంద్ర ప్ర‌సాద్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు సరైనవే అని ఏపీ హైకోర్టు ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోమని మాత్రమే కోర్టు చెప్పిందన్నారు. న్యాయస్థానం ఈరోజు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబుతో చర్చించి అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా పోతామని వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -