Tuesday, May 14, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో ఎవ‌రెవ్వ‌రు ఎంత తీసుకుంటున్నారో తెలుసా?

- Advertisement -

బిగ్‌బాస్ రియాల్టీ షో మొట్ట‌మొద‌టిగా హిందీలో ప్రారంభ‌మైంది.అక్క‌డ సూపర్ హిట్ కావ‌డంతో త‌రువాత కాలంతో అన్ని భాష‌ల‌లోకి బిగ్‌బాస్‌ను మొద‌లు పెట్టారు.బిగ్‌బాస్ హిందీతోపాటు తెలుగు,త‌మిళ‌,మ‌ళ‌యాళ భాష‌ల‌లో తీస్తున్నారు. హిందీ బిగ్‌బాస్ ప్ర‌స్తుతం 12వ సీజ‌న్ న‌డుస్తుంది.తెలుగు,త‌మిళ భాష‌ల‌లో రెండో సీజ‌న్ సాగుతుంది.తెలుగులో నాని ,త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ బిగ్‌బాస్ హౌస్ట్‌గా వ్య‌వ‌హారిస్తున్నారు.ఇక హిందీ బిగ్‌బాస్‌కు స‌ల్మాన్ ఖాన్ యాంక‌ర్‌గా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.తాజాగా హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు తీసుకునే పారితోష‌కం గురించి సోష‌ల్ మీడియాలో ఓ న్యూస్ వైర‌ల్‌గా మారింది.హోస్ట్‌గా పనిచేస్తున్న కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు భారీ మొత్తంలో పారితోష‌కం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది.

బిగ్‌బాస్ యాంక‌ర్‌గా చేస్తున్నందుకు స‌ల్మాన్ 14 కోట్లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. హిందీ బిగ్‌బాస్  షోలో అ‍త్యధికంగా సంపాదించే కంటెస్టెంట్‌గా అనూప్‌ చరిత్ర సృష్టించాడు. అనూప్‌కు వారానికి రూ.45 లక్షలను చెల్లిస్తున్నారు. ససురాల్‌ సిమర్‌ కా స్టార్‌ దీపికాకు వారానికి రూ.15 లక్షలు ఇస్తున్నార‌టా.మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌, వారానికి రూ.5 లక్షలను సంపాదిస్తున్నాడు.బిగ్‌బాస్ 12వ సీజన్‌లో ఎక్కువగా సంపాదన ఆర్జించే కంటెస్టెంట్లో నేహా కూడా ఒకరు. హౌజ్‌లో ఉన్నంత కాలం ఈమె వారానికి 20 లక్షల రూపాయలను సంపాదిస్తున్నారని స‌మాచారం.మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో తెలియాలి.హిందీ బిగ్‌బాస్‌తో పోలిస్తే తెలుగు బిగ్‌బాస్‌కు చాలా త‌క్కువే ఇస్తార‌ని వినికిడి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -