Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌తో అదిరిపోయ్యే సాంగ్ చేశా – జానీ మాస్టర్

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో మంచి డ్యాన్స్ మాస్ట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు జానీ. సినిమాలో మాస్ మాసాలా సాంగ్ ఉంటే ఆ సాంగ్‌ని జానీ చేత చేయిస్తారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.ఎన్టీఆర్‌,రామ్‌చ‌ర‌ణ్ ,బ‌న్నీ ఇలా స్టార్ హీరోల సినిమాల‌లో జానీ మాస్ట‌ర్ చేత ఓ సాంగ్ కొరియోగ్ర‌ఫీ చేయించుకుంటారు.తాజాగా ఎన్టీఆర్ న‌టిస్తున్న అర‌వింద స‌మేత చిత్రంలో ఓ సాంగ్ చేశాడ‌టా జానీ.ఈ విష‌యాన్ని జానీయే స్వ‌యంగా చెప్పుకొచ్చాడు.

జానీ మాస్ట‌ర్ ట్వీట్ట‌ర్ ద్వారా స్పందిస్తు… “చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ గార్లతో కలిసి పనిచేశాను. ఎన్టీఆర్ కి నేను కంపోజ్ చేసిన సాంగ్ అద్భుతంగా వచ్చింది. మీ అందరి కంటే ఎక్కువగా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ ఒక ఫోటోను షేర్ చేశాడు.ఇక సినిమాలో ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.సినిమాను ద‌స‌రాకు కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -