తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ గురించి ఇప్పుడు పెద్ద వివాదమే నడస్తోంది. కౌశల్‌పై ఆయన అభిమానులు తిరగబడిన సంగతి తెలిసిందే. కౌశల్ ఆర్మీ పేరిట పెట్టిన పౌండేషన్‌లోని డబ్బును కౌశల్ తన వ్యక్తిగతంగా వాడుకుంటున్నాడని ఆర్మీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు కౌశల్. గురువారం మీడియా సమావేశం పెట్టి తనపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో చెప్పుకొచ్చాడు. నేను బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తరవాత చాలామంది అభిమానులను కలిశానని, వారితో ఫోటోలు దిగానని తెలిపాడు కౌశల్.
తనతో దిగిన ఫోటోలను అడ్డం పెట్టుకుని ఆర్మీలోని కొందరు సభ్యులు అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని తెలిపాడు. తనను కల్పిస్తానని మాయ మాటలు చెబుతు, వారి న్యూడ్ ఫోటోలను పంపించమని కోరారట కొందరు ఆర్మీ సభ్యులు. ఈ విషయం తెలుసుకున్న కౌశల్ వారిని ఆర్మీ నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది. పౌండేషన్‌లో అన్ని లెక్కలు కరెక్ట్‌గానే ఉన్నాయాని , కావలంటే ఎవరు అయిన వచ్చి చెక్ చేసుకోవచ్చని తెలిపాడు కౌశల్. ఆర్మీ నుంచి బయటికి వెళ్లిన వారు ఓ మీడియా ఛానెల్‌ను అడ్డం పెట్టుకుని తనపై కుట్ర చేస్తున్నారని, ఇలాంటి వారికి నేను బయపడనని చెప్పుకొచ్చాడు కౌశల్.
- Advertisement -
కౌశల్‌ను కలవాలంటే అమ్మాయిల న్యూడ్ ఫోటోలు పంపలట..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
