Monday, April 29, 2024
- Advertisement -

బిగ్‌బాస్ ఎఫెక్ట్ : గీతా మాధురికి సినిమాలో ఛాన్స్‌..!

- Advertisement -

సింగ‌ర్ గీతా మాధురి తన గానంతో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది.తాజాగా ఆమె తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ర‌న్న‌ర్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.చాలామంది బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విన్న‌ర్‌గా గీతానే గెలుస్తుంద‌ని భావించారు.కాని ర‌న్నర్‌ప్‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.కాని గీతా మాధురిలో బిగ్‌బాస్‌లో చేసిన న‌ట‌న‌కుగానే సినిమాలో అవ‌కాశాలు గీతానే వెతుకుంటు వ‌స్తున్నాయి.బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా భరతమాత అవతారమెత్తి ఆ పాత్రలో ఒదిగిపోయింది.

ఆ టాస్క్ చూసిన వారు కూడా ‘అరెరె గీత ఇంత బాగా నటిస్తుందా..?’ అనుకున్నారు. హోస్ట్ నాని కూడా సినిమాల్లోకి వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా..? అని గీతాని అడిగారు.ఆ సమయంలో అలాంటిదేమీ లేదని చెప్పిన గీతామాధురి త్వరలోనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ యాక్షన్, థ్రిల్లర్ సినిమాలో నటించే అవకాశం రావడంతో గీతా ఓకే చెప్పేసిందట. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా మొదలుకానుందని సమాచారం.ఇక మీద గీతా మాధురి గొంతుతో కాకుండా న‌ట‌న‌తో కూడా అల‌రించ‌నుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -