అభ్యర్థుల ఎంపికలో వైసీపీ అధిష్టానం ఆచి తూచి అడుగులు వేస్తుంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారం ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్తులను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. తాజాగా త్తిపాడు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిత్వంపై తేల్చేశారు జగన్.
ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగనున్న వైసిపి అభ్యర్థిపై క్లారిటీ వాచినట్టు తెలుస్తోంది. నియోజకవర్గ ఇంచార్జ్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ వైసీపీ అభ్యర్థి అంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి పరోక్ష సంకేతాలిచ్చారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు బూత్‌స్థాయి కమిటీ సభ్యులు ,కన్వీనర్లతో సమావేశమైన వైవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ పార్టీ పటిష్టతకు విశేషంగా కృషి చేస్తున్నారని అభినందించారు. పర్వత నేతృత్వంలోనే ప్రత్తిపాడు ఎన్నికలకు సన్నద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు.
సోమవారం సాయంత్రం స్థానికంగా ఉన్న రాఘవేంద్ర రెసిడెన్సీలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీ సభ్యులు, కన్వీనర్లతో ఆయన సమావేశమయ్యారు. నవరత్నాల పధకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, సీఎం చంద్రబాబు రాష్ట్రానికి చేసిన మోసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని తెలిపారు.
మరోవైపు ప్రత్తిపాడు టిక్కెట్ ఆశిస్తున్న మురళీకృష్ణం రాజు, ఆయన అనుచరులు కానీ వైవీ సుబ్బారెడ్డి సమావేశానికి గైర్హాజరయ్యారు. నియోకజవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన మురళీ కృష్ణం రాజు వర్గీయులు డుమ్మాకొట్టారు. నామమాత్రంగా కేవలం 10 మంది మాత్రమే హాజరయ్యారు. వ్వడం చర్చనీయాంశంగా మారింది.
నియోజకవర్గంలో సర్వేలు చేయించి పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, పార్టీని బలపరుస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న నాయకులకే జగన్ టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. గెలుపు ఓటములు బేరీజు వేసుకునే అభ్యర్థులను కేటాయిస్తున్నారు జగన్. దీనికోసం అభ్యర్థులను మార్చటానికి, కొత్త అభ్యర్థులను రంగంలోకి దించడానికి ఆయన వెనుకాడడం లేదు.
