Monday, May 20, 2024
- Advertisement -

కుక్కల్లా అనగానే పిచ్చికుక్కళ్లా పడిపోయారు

- Advertisement -

నేను మాట్లాడితే చాలు పది మంది కుక్కల్లా వచ్చి పడిపోతున్నారంటూ..కౌషల్ అన్నాడో లేదో హౌస్ మేట్స్ పిచ్చికుక్కల్లా అతడి మీద మళ్లీ పడిపోయారు. వానపాములా తేజశ్వి ముద్దుముచ్చట్లతో స్మోకింగ్ స్టార్ తనీష్ తో సోది కబుర్లు చెప్పుకుంటూ మనిషి పెరిగాడు తప్ప బుర్ర పెరగలేదని ఇన్నాళ్లూ ప్రేక్షకులతో అనిపించుకుంటున్న సామ్రాట్ కి ఎక్కడలేని పౌరుషం వచ్చేసింది. ఏయ్..ఏమన్నావ్ రా..ఏంట్రా..అంటూ ఊగిపోతూ కౌషల్ మీదకు కొట్టేసేందుకు వచ్చేశాడు. వాస్తవానికి కౌషల్ అన్నమాట తప్పేం కాదు. మంగళవారం ఎపిసోడ్ చూసిన కోట్లమంది ప్రేక్షకులు బయట అదే విషయంపై ట్రోల్స్ చేస్తున్నారు. గజరాజు వెళ్తుటే కుక్కలు మొరిగినట్లు ఒక్కడిని చేసి, ఇంతమంది చుట్టుముట్టి, సూటిపోటి మాటలతో అంత దారుణంగా వేధించడం ఏంటి ? అంటూ మండిపడ్డారు. అదే మాటను కౌషల్ కూడా అన్నాడు. మాట్లాడితే చాలు పదిమంది కుక్కల్లా పడిపోతున్నారని. దానికే పెద్ద ఫీలయిపోయి అతడి మీద దాడికి తెగబడ్డారు. కుక్కలా అరవకు, కుక్కలా వాగకు, కుక్కల్లా కొట్లాడుకున్నారు. కుక్కల్లా వెంటపడ్డారు..అంటూ ఇలా అనేక రకాలుగా నిత్యం జనం మనుషులను కుక్కలతో పోల్చడం సహజం. కుక్కల నైజాన్ని ప్రదర్శిస్తున్నారు అని చెప్పడమే తప్ప, కుక్కలు అని చెప్పడం కాదు.

అయినా రోల్ రైడాను ఫైనల్స్ లోకి నేరుగా పంపేందుకు తనీష్, సామ్రాట్, కలిసి మీ ఇసుక జాగ్రత్త టాస్కు ఆడిన తీరు చూసిన ప్రేక్షకులు కుక్కలేంటి అంతకంటే దారుణంగా బూతులు తిడుతూ వీరిపై ట్రోల్స్ చేస్తున్నారు. బయటకు వచ్చాక ఆ ట్రోల్స్, మైమ్స్ చూస్తే వీళ్లు గుండెలు పగిలి చస్తారేమో. ఆట ఆడే దమ్ము లేక, మొన్న నానీ రెచ్చగొట్టేసరికి అయినదానికీ కానిదానికీ కౌషల్ మీద నోరేసుకుని పడిపోతున్న వీరిలో డైరెక్టుగా ఫినాలేకి వెళ్లిపోవచ్చనే ఆశ బాగా పెరిగిపోయింది. అందుకే మీ ఇసుక జాగ్రత్త టాస్కులో కౌషల్ ను ఓడించడంతో పాటు, ఎలాగైనా రోల్ రైడాను గెలిపించాలని కంకణం కట్టుకుని గెలిపించేశారు. దానిపై కౌషల్ మీలా బంధాలు పెట్టుకుని, గేమ్ లు నేను ఆడలేను..అని చెప్పినప్పుడు కూడా వీరికి ఎక్కడ లేని పౌరుషం పొడుచుకొచ్చేసింది. మా బంధాలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు కనుకే, ఓట్లు వేస్తున్నారు. అందుకే ఇన్నాళ్లు హౌస్ లో ఉన్నామంటూ మళ్లీ మాటల దాడికి దిగారు. నేటి ఎపిసోడ్ ప్రోమో చూస్తే రోల్ రైడా ఏకంగా జీవించేశాడని స్పషమవుతోంది.

అక్కా, అన్నా అంటూ పులిహోరా సంబంధాలు కలుపుకుంటూ ఇన్నాళ్లూ నామినేట్ కాకుండా సేఫ్ గేమ్ ఆడుతూ హౌస్లో ఉండిపోయాడు. గల్లీ ప్రజల ప్రతినిధిలాగా ఫోజు కొడుతూ గల్లీ జనాల ఓట్లు దక్కించుకోవాలని ఆ మధ్య డ్రామాలాడాడు. ఇప్పుడు ఏకంగా కౌషల్ మమ్మల్ని కుక్కలంటావా ? మేమెంత కష్టపడి వచ్చామో తెలుసా ? అంటూ ఏడుపు మొదలెట్టేశాడు. బాబాయ్ గల్లీ గల్లీ అని మాటాడితే గల్లీ జపం చేసే రోల్ రైడాకు మనుషులను కుక్కలతో పోల్చడం అనేది చాలా చిన్న విషయం అని తెలియదా ? కౌషల్ కాకుండా వేరే వాళ్లు అనుంటే అబ్బా భలేగా పోల్చావ్ అంటూ మళ్లీ కామెడీ చేసేసి, వీడి ఓవరాక్షన్ వేరేలా ఉండేది. కానీ కౌషల్ మీద మానసిక దాడి చేస్తుంటే భరించలేకే అన్న ఒక్క మాటను సాగదీసి సానుభూతి ఓట్లు కొట్టేయాలని వేసిన వేషాలు ప్రేక్షకులకు కంపరమెత్తించాయి. ఇక వీడిని ఎలిమినేట్ చేయాల్సిందేనని ప్రతిన భూనేలా చేశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -